Unstoppable Season 4 : సీఎం చంద్రబాబు కోసం కూరగాయల షాప్ సెట్ వేసిన బాలయ్య..
ఆహా వేదికగా నందమూరి నట సింహం బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ మూడు సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది.

Unstoppable Season 4 First Episode CM Chandra babu guest
Unstoppable Season 4 : ఆహా వేదికగా నందమూరి నట సింహం బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ మూడు సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. బాలయ్య హోస్టింగ్ స్టైల్, మాటలు ప్రజలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక నాలుగో సీజన్ అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే అన్‌స్టాపబుల్ సీజన్ 4కు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇక ట్రైలర్‌లో మంచి జోష్‌లో కనిపించారు బాలయ్య.
నాలుగో సీజన్‌కు సంబంధించిన తొలి ఎపిసోడ్ షూటింగ్ నిన్న (ఆదివారం) హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగింది. తెలుగు దేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాలుగో సీజన్ తొలి ఎపిసోడ్‌కు అతిథిగా వచ్చారు. షో సెట్స్ లో చంద్రబాబు అడుగుపెట్టగా బాలకృష్ణ ఆయనను సాధరంగా స్వాగతించారు.
Mathu Vadalara 2 Riya : రియా ఎవరో దొరికేసింది.. దామిని డాటర్.. మత్తు వదలరా 2 ఫేమ్ రియా ఎవరో తెలుసా?
ఈ షోలో ఎన్నికల ముందు, ఆ తరువాత జరిగిన పరిణామాలను చంద్రబాబు పంచుకున్నట్లుగా తెలుస్తోంది. బాలయ్య సంగతి చెప్పేదేముంది.. సీఎం చేత కొన్ని టాస్క్‌లు ఆడించారట. కూరగాయల షాప్ సెట్ వేయించారట. మొత్తానికి ముఖ్యమంత్రి చేత కూరగాయాలను కొనిపించారట బాలయ్య.
ఇక చంద్రబాబు కూడా తగ్గేదేలే అన్నట్లు ఆడారట. బాలయ్యని ఓ రేంజ్‌లో ఆడుకున్నారట. మొత్తానికి ఈ షో బావ బామర్దిల మధ్య సరదాగా సాగినట్లు సమాచారం. ఇక అన్‌స్టాపబుల్ తొలి ఎపిసోడ్ ఆహా వేదికగా అక్టోబర్ 25న రాత్రి 8.30 గంటలకు స్ట్రీమింగ్ కానుంది. ఈ ఫస్ట్ ఎపిసోడ్ కోసం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.