Ram Charan : చరణ్ క్రేజ్ హాలీవుడ్, జపాన్ దాటి కొరియా దాకా వెళ్ళిందిగా.. ‘గేమ్ ఛేంజర్’ సాంగ్‌కి K పాప్ సింగర్ డ్యాన్స్..
ఇప్పుడు చరణ్ క్రేజ్ సౌత్ కొరియాకు కూడా పాకింది.

South Korean Pop singer Park Min-jun Dance for Ram Charan Game Changer Raa Macha Macha song
Ram Charan : రామ చరణ్ RRR సినిమాతో ఇండియాలోనే కాక విదేశాల్లో కూడా క్రేజ్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ లో, జపాన్ లో రామ్ చరణ్ ఇప్పటికే ఫ్యాన్స్ ని సంపాదించుకున్నారు. నాటు నాటు పాటతో అనేక దేశాల్లో చరణ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు చరణ్ క్రేజ్ సౌత్ కొరియాకు కూడా పాకింది.
సంక్రాంతికి రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాతో రాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన రెండు సాంగ్ బాగా వైరల్ అయ్యాయి. ఇటీవల వచ్చిన రా మచ్చ రా మచ్చ సాంగ్ మంచి వైబ్ తో ఫ్యాన్స్ ని, ఆడియన్స్ ని మెప్పిస్తుంది. ఇటీవల ప్రముఖ కొరియన్ పాప్ సింగర్ పార్క్ మిన్ జున్ తన టీమ్ తో కలిసి గేమ్ ఛేంజర్ లోని రా మచ్చ రా మచ్చ.. సాంగ్ కి స్టెప్స్ వేసాడు. ఈ డ్యాన్స్ వీడియో కొంచెం లేట్ అయినా ప్రస్తుతం వైరల్ గా మారింది.
Also Read : Viswant Duddumpudi : పెళ్లి చేసుకున్నాడా? నిశ్చితార్థం చేసుకున్నాడా? ‘గేమ్ ఛేంజర్’ నటుడి ఫొటోలు వైరల్..
దీంతో చరణ్ ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్ సినిమాకు గ్లోబల్ రీచ్ వస్తుంది, అందుకే చరణ్ ని గోబర్ స్టార్ అనడంలో తప్పులేదు అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ కొరియన్ సింగర్ చేసిన డ్యాన్స్ వీడియోని చరణ్ ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. మీరు కూడా ఈ వీడియో చూసేయండి..
ఈ కొరియన్ పాప్ సింగర్ పార్క్ మిన్ జున్.. ఔరా అనే స్టేజ్ నేమ్ తో కొరియాలో బాగా పాపులర్ పాప్ సింగర్. పలు దేశాలు తిరుగుతూ అక్కడి సంప్రదాయాలు, అక్కడి సాంగ్స్ కి డ్యాన్స్ లు వేస్తూ మరింత వైరల్ అవుతున్నాడు పార్క్ మిన్ జున్. గతంలో కూడా పలు ఇండియన్ సాంగ్స్ కి ఇండియా వచ్చినప్పుడు డ్యాన్సులు వేసి అలరించాడు.