Allu Arjun : ఐకాన్ స్టార్ ఇంటిలో కూడా మిడిల్ క్లాస్ మంచాలు.. అంత సింప్లిసిటీనా..!

ఐకాన్ స్టార్ వంటి హీరో ఇంటిలో మిడిల్ క్లాస్ మంచాలు. ఆరుబయట చల్లగాలిలో..

Allu Arjun Sneha Reddy instagram stories gone viral

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాతో ఇంటర్నేషనల్ లెవెల్ గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇటీవల నేషనల్ అవార్డుని అందుకొని, ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న బిగ్గెస్ట్ హీరోల లిస్టులో తాను ఒకరిగా చేరారు. ఈ రేంజ్ తో అల్లు అర్జున్.. కోట్లలోనే రెమ్యూనరేషన్ ని తీసుకుంటున్నారు.
అంత పెద్ద స్థాయికి ఎదిగినా అల్లు అర్జున్ ఇంటిలో.. సింపుల్ ఫర్నిచర్ కనిపిస్తుంది.

అల్లు స్నేహారెడ్డి తన ఇన్‌స్టా స్టోరీలో ఒక ఫోటో షేర్ చేసారు. ఆ ఫొటోలో అల్లు అయాన్ ‘నవారు మంచం’పై ఆరుబయట పడుకొని కనిపిస్తున్నాడు. ఇలాంటి మంచాలను మనం ఎక్కువుగా మిడిల్ క్లాస్ లేదా లోవర్ క్లాస్ ఫ్యామిలీస్ లో చూస్తుంటాము. వేసవి కాలం సమయంలో ఆ మంచాలను ఆరుబయట వేసుకొని చల్ల గాలికి సేదతీరుంటారు సాధారణ మధ్యతరగతి కుటుంబాలు.

Also read : Janhvi Kapoor : రామ్ చరణ్ సినిమాలోకి అఫీషియల్ ఎంట్రీ ఇచ్చేసిన జాన్వీ..

ఇప్పుడు అదే సీన్ ఐకాన్ స్టార్ వంటి హీరో ఇంటిలో కనిపిస్తే అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏసీ రూమ్‌ల్లో సేదతీరాల్సిన హీరో పిల్లలు.. ఆరుబయట చల్లగాలిలో, అదికూడా నవారు మంచం పై రిలాక్స్ అవుతున్న దృశ్యం అందర్నీ ఆకర్షిస్తుంది. కాగా స్నేహారెడ్డి పిల్లల విషయంలో తాను ఫాలో అయ్యే పేరెంటింగ్ ఫార్ములాస్ ఇది ఒక భాగం అని తెలుస్తుంది. రోజులో కాసేపు అయిన పిల్లలను ప్రకృతి మధ్య గడిపేలా చూసుకోవాలని స్నేహారెడ్డి ఇటీవల తన పేరెంటింగ్ వీడియోలో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.

కాగా నేడు అల్లు అర్జున్, స్నేహారెడ్డి పెళ్లిరోజు. 2011 మార్చి 6న వీరిద్దరి వివాహం జరిగింది. నేటితో 13 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నారు. దీంతో అల్లు అర్జున్ తన భార్య స్నేహకి విషెస్ తెలియజేస్తూ పోస్టు వేశారు. “నీ తోడు నాకు బలం. ఈ బంధం చివరి వరకు ఇలాగే కొనసాగాలి” అంటూ రాసుకొచ్చారు. అలాగే పెళ్లిలో తాళి కడుతున్న ఫోటోని కూడా బన్నీ షేర్ చేసారు.

ట్రెండింగ్ వార్తలు