×
Ad

Allu Arjun : మామ సినిమాపై అల్లు అర్జున్ ట్వీట్.. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మన శంకర వరప్రసాద్ గారు సినిమాని అభినందిస్తూ ట్వీట్ చేసాడు. (Allu Arjun)

Allu Arjun

  • మన శంకర వరప్రసాద్ గారు సినిమా సక్సెస్
  • అల్లు అర్జున్ ట్వీట్
  • బాస్ ఈజ్ బ్యాక్ అంటూ

Allu Arjun : మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సంక్రాంతికి వచ్చిన సినిమా మన శంకర వరప్రసాద్ గారు. ఈ సినిమా సంక్రాంతికి థియేటర్స్ లో రిలీజయి భారీ విజయం సాధించింది. వింటేజ్ చిరంజీవిని చూపించారని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా 300 కోట్ల గ్రాస్ దాటేసి సరికొత్త రికార్డ్ సెట్ చేసింది.

మన శంకర వరప్రసాద్ గారు సినిమాపై ఫ్యాన్స్, ప్రేక్షకులే కాకుండా సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా చిరంజీవి అల్లుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మన శంకర వరప్రసాద్ గారు సినిమాని అభినందిస్తూ ట్వీట్ చేసాడు.

Also Read : Sharwanand : ఆ సినిమాల్లో నన్ను చూసి నాకే ఛీ అనిపించింది.. ఆ యాక్సిడెంట్ తర్వాత.. శర్వానంద్ కామెంట్స్ వైరల్..

అల్లు అర్జున్ తన ట్వీట్ లో.. మన శంకర వరప్రసాద్ గారు సినిమా టీమ్ అందరికి అభినందనలు. బాస్ ఈజ్ బ్యాక్. మన మెగాస్టార్ చిరంజీవి గారిని స్క్రీన్ మీద ఇలా చూడటం చాలా సంతోషంగా ఉంది. వింటేజ్ వైబ్స్ వచ్చాయి. వెంకటేష్ గారు అదరగొట్టారు. నయనతార గ్రేషియస్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. క్యాథరిన్ త్రెసా నవ్వించింది. అందరు ఆర్టిస్టులు ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సంక్రాంతి స్టార్ బుల్లి రాజు కూడా బాగా నవ్వించాడు. సాంగ్స్ అన్ని విజిల్స్ వేసేలా ఉన్నాయి. ముఖ్యంగా హుక్ స్టెప్ సాంగ్, మెగా విక్టరీ సాంగ్స్. భీమ్స్ తో పాటు అందరు సాంకేతిక నిపుణులు, నా కజిన్ సుస్మిత, సాహు అందరికి కంగ్రాట్స్.

సంక్రాంతి బ్లాక్ బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి గారు సంక్రాంతికి వస్తారు హిట్ కొడతారు రిపీట్. ఇది కేవలం సంక్రాంతి బ్లాక్ బస్టర్ కాదు. ఈ సంక్రాంతి బాస్ బస్టర్ అని పోస్ట్ చేసారు. దీంతో అల్లు అర్జున్ చిరంజీవి సినిమా మీద ట్వీట్ చేయడంతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తూ ఈ ట్వీట్ వైరల్ చేస్తున్నారు.

Also Read : Peddi : రామ్ చరణ్‌ పెద్దిలో పవన్ కల్యాణ్ !