Peddi : రామ్ చరణ్‌ పెద్దిలో పవన్ కల్యాణ్ !

మెగాపవర్‌ స్టార్ రామ్ చరణ్‌, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న పెద్ది సినిమా (Peddi) గురించి రోజుకో ఇంట్రస్టింగ్‌ న్యూస్‌ నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Peddi : రామ్ చరణ్‌ పెద్దిలో పవన్ కల్యాణ్ !

Gossip Garage Pawan Kalyan special role in Ram Charan Peddi

Updated On : January 20, 2026 / 3:39 PM IST

Peddi : మెగాపవర్‌ స్టార్ రామ్ చరణ్‌, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న పెద్ది సినిమా గురించి రోజుకో ఇంట్రస్టింగ్‌ న్యూస్‌ నెట్టింట్లో వైరల్ అవుతోంది. రూరల్‌ స్పోర్ట్స్‌ డ్రామాగా తెరకెక్కుతున్న పెద్ది సినిమాపై.. ఇప్పటికే భారీ హైప్‌ క్రియేట్‌ అయింది. గ్లింప్స్‌, టీజర్‌కు అద్భుతమైన స్పందన కనిపించింది. ఇక ఫస్ట్‌ సింగిల్‌ చికిరి చికిరి సాంగ్‌ సోషల్‌మీడియాను దున్నేస్తోంది. ఈ పాట యూట్యూబ్‌లో రెండొందల మిలియన్‌ వ్యూస్‌ను దక్కించుకొని సరికొత్త రికార్డు క్రియేట్‌ చేసింది.

ఇక సినిమా క్లైమాక్స్, కేరక్టర్స్ గురించి క్రేజీ రూమర్స్ బయటకు వచ్చాయ్‌. ఈ చిత్రంలో సీనియర్ నటి టబు ఓ పవర్‌ఫుల్‌ రోల్‌లో యాక్ట్ చేయబోతున్నారని, ఆ పాత్ర కేవలం ఫ్లాష్‌బ్యాక్‌లోనే వచ్చినా కథను మలుపు తిప్పేలా ఉంటుందనే గాసిప్స్‌ వినిపించాయి. ఇక కైమాక్స్‌కు సంబంధించి జరుగుతున్న ప్రచారం అంతా ఇంతా కాదు. ఐతే ఇప్పుడో మరో క్రేజీ గాసిప్ వైరల్ అవుతోంది.

Mana Shankara Varaprasad Garu : బాక్సాఫీస్ బద్దలైపోయింది.. మెగాస్టార్ సరికొత్త రికార్డ్.. రికార్డ్ బ్రేక్ చేసిన అనిల్ రావిపూడి..

పెద్ది మూవీలో పవన్ కల్యాణ్‌ స్పెషల్‌ క్యామియోలో కనిపించబోతున్నాడట. అదే జరిగితే ఇక థియేటర్లలో డబుల్ బ్లాస్ట్ క్రియేట్ కావడం ఖాయం. ఈ క్యామియో సీన్ ఉత్తరాంధ్ర స్టైల్‌లో ఉంటుందని పవన్ కూడా ఆ ఏరియా స్లాంగ్‌లోనే డైలాగ్స్ చెప్తారని టాక్‌ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. స్పెషల్ రోల్‌లో కనిపించనున్న పవన్‌ విజయనగరం, విశాఖ స్టైల్‌లో రఫ్ అండ్ ఇంటెన్స్ డైలాగ్స్ డెలివర్ చేస్తారని గాసిప్.

ఆ డైలాగ్స్‌కు థియేటర్లు ఆగిపోవడం కూడా ఖాయమట. ఈ స్లాంగ్ రామ్ చరణ్ క్యారెక్టర్‌తో కలిసి రూరల్ వైబ్‌ని మరింత బూస్ట్ చేస్తుందంట. పవన్ ఈ రోల్ కోసం స్పెషల్ లుక్, ఎనర్జీతో రెడీ అవుతున్నారని సోర్సెస్ చెప్తున్నాయి. దీంతో పెద్ది కోసం ఫ్యాన్స్ మరింత ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మార్చి 27న రాంచరణ్ బర్త్‌ డే రోజు ఈ మూవీ రిలీజ్ కానుంది.