Mana Shankara Varaprasad Garu : బాక్సాఫీస్ బద్దలైపోయింది.. మెగాస్టార్ సరికొత్త రికార్డ్.. రికార్డ్ బ్రేక్ చేసిన అనిల్ రావిపూడి..

ఈ సినిమా ఆరు రోజుల్లో 292 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు నేడు ఉదయం ప్రకటించారు. (Mana Shankara Varaprasad Garu)

Mana Shankara Varaprasad Garu : బాక్సాఫీస్ బద్దలైపోయింది.. మెగాస్టార్ సరికొత్త రికార్డ్.. రికార్డ్ బ్రేక్ చేసిన అనిల్ రావిపూడి..

Mana Shankara Varaprasad Garu

Updated On : January 19, 2026 / 9:39 PM IST
  • మన శంకర వరప్రసాద్ గారు లేటెస్ట్ కలెక్షన్స్
  • మెగాస్టార్ సరికొత్త రికార్డ్
  • రికార్డ్ బ్రేక్ చేసిన అనిల్ రావిపూడి

Mana Shankara Varaprasad Garu : మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సంక్రాంతికి వచ్చిన సినిమా మన శంకర వరప్రసాద్ గారు. ఈ సినిమా సంక్రాంతికి థియేటర్స్ లో రిలీజయి భారీ విజయం సాధించింది. తండ్రి ఎమోషన్, భార్యాభర్తల బంధం, కామెడీ, వింటేజ్ మెగాస్టార్ లుక్స్, వెంకటేష్ గెస్ట్ రోల్స్, అదరగొట్టే సాంగ్స్, చిరు స్టెప్స్.. ఇవన్నీ కలిసి ఈ సినిమాని పెద్ద హిట్ చేసాయి.(Mana Shankara Varaprasad Garu)

ప్రీమియర్స్ నుంచే మన శంకర వరప్రసాద్ గారు సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని ఫ్యాన్స్ ని, ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేస్తుంది. దీంతో కలెక్షన్స్ కూడా భారీగా వస్తున్నాయి. మొదటి రోజే 84 కోట్ల గ్రాస్ సాధించి చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ గా నిలిచింది ఈ సినిమా. ఇక ఈ సినిమా ఆరు రోజుల్లో 292 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు నేడు ఉదయం ప్రకటించారు.

Also Read : Varanasi : శ్రీరామనవమికి ‘వారణాసి’ నుంచి అప్డేట్ ఇదే.. ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ గ్యారెంటీ..

తాజాగా నేడు ఫస్ట్ షో ఆటతో మన శంకర వరప్రసాద్ గారు సినిమా 300 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. చిరంజీవి 300 కోట్లు అని రాసున్న గోడని బద్దలు కొట్టినట్టు సినిమాలోని సీన్ తో అదిరిపోయే వీడియోని రిలీజ్ చేసారు. చిరంజీవి కెరీర్లో హైయెస్ట్ గ్రాస్ వసూలు చేసిన సినిమాగా మన శంకర వరప్రసాద్ గారు నిలిచింది. అయితే ఈ కలెక్షన్స్ జోరు ఇప్పుడే ఆగదు.

మరో రెండు వారాల వరకు కొత్త సినిమాలేవీ లేకపోవడంతో మన శంకర వరప్రసాద్ గారు థియేటర్స్ లో ఇంకా నడుస్తుంది. దీంతో ఇంకా వంద కోట్లు ఈజీగా వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే అనిల్ రావిపూడి వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో 303 కోట్ల గ్రాస్ వసూలు చేసి రీజనల్ సినిమాల్లో సరికొత్త రికార్డ్ సెట్ చేసారు. ఇప్పుడు ఈ మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో తన రికార్డ్ ని తనే బద్దలుకొట్టబోతున్నాడు అనిల్ రావిపూడి.

Also See : Allu Arjun : ఫ్యామిలీతో జపాన్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్.. ఫొటోలు షేర్ చేసిన స్నేహ రెడ్డి..

అంతే కాకుండా రీజనల్ సినిమాల్లో అత్యధిక గ్రాస్ వసూలు చేసిన సినిమాగా మన శంకర వరప్రసాద్ గారు నిలవనుంది. రీజనల్, ఎంటర్టైన్మెంట్ సినిమాతో ఇలా వందల కోట్ల గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డులు సెట్ చేయడం అనిల్ రావిపూడికే చెల్లింది. మొత్తానికి బాస్ సినిమాలోనే కాక బాక్సాఫీస్ ని బద్దలుకొట్టి వింటేజ్ మెగాస్టార్ స్టామినాని చూపించారు.