Allu Arjun Sreeleela starrer in Aha original content of Arjun Leela
Allu Arjun – Aha : తెలుగు ఓటీటీ ఆహా వరుస సక్సెస్ ఫుల్ షోలతో దూసుకుపోతుంది. బాలకృష్ణ (Balakrishna) అన్‌స్టాపబుల్ షోతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వ్యూయర్ షిప్‌ని సొంతం చేసుకున్న ఆహా.. తెలుగు ఇండియన్ ఐడల్ (Telugu Indian Idol) కి కూడా మంచి స్పందన అందుకుంది. ఇటీవలే ఈ షో సెకండ్ సీజన్ ఆడియన్స్ ముందుకు వచ్చి మొదటి సీజన్ కంటే సూపర్ హిట్టుగా నిలిచింది. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ అండ్ శ్రీలీలతో (Sreeleela) సరికొత్త కంటెంట్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు.
OTT Releases : ఒక పక్క థియేటర్‌లో ఆదిపురుష్.. మరో పక్క ఓటీటీలో బ్లాక్ బస్టర్ మూవీస్ రిలీజ్..
ఆహా ఒరిజినల్ కంటెంట్ గా అర్జున్ లీల (Arjun Leela) అంటూ ఒక చిన్న గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ లో హీరోయిన్ శ్రీలీల పై ఒక దొంగ కత్తిపెట్టి బెదిరిస్తుంటే పోలీస్ వాడిని ఆపుతుంటాడు. ఇంతలో అక్కడికి అల్లు అర్జున్ కారులో రావడంతో గ్లింప్స్ పూర్తి అయ్యింది. ఇంతకీ ఇది మూవీనా? ప్రమోషనల్ సాంగా? అనేది క్లారిటీ ఇవ్వలేదు. మీరు ఉదయం 10 గంటలకు ఈ అర్జున్ లీల నుంచి అసలు బొమ్మ రిలీజ్ చేస్తామంటూ తెలియజేశారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దీనిని డైరెక్ట్ చేశాడు.
Pawan Kalyan OG : పవన్‌కి విలన్‌గా మారుతున్న బాలీవుడ్ రొమాంటిక్ స్టార్..
ఈ అర్జున్ లీల అసలు బొమ్మ ఏంటో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే. కాగా అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలయికలో ఒక సినిమా ఉండబోతున్నట్లు ఇటీవల బన్నీ వాసు తెలియజేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ బాబుతో గుంటూరు కారం (Guntur Karam) సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఆ చిత్రంలో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తుంది.
Idi glimpse matrame ?. Asal bomma chuste agaleru anthe ? An aha Original, ‘Arjun Leela’ releasing exclusively on aha app @ 10 AM tomorrow.#AAtakesoverAha @alluarjun @sreeleela14 pic.twitter.com/EEkYL3cNbC
— ahavideoin (@ahavideoIN) June 15, 2023