Pushpa 2: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ మూవీ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో మనం చూశాం. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ ఊరమాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో పుష్పరాజ్ పాత్రలో బన్నీ పర్ఫార్మెన్స్ నెక్ట్స్ లెవెల్లో ఉండటంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ ఆసక్తిని చూపారు. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా పుష్ప-2 చిత్రాన్ని తెరకెక్కిస్తోంది చిత్ర యూనిట్.
Pushpa 2: శేషాచలం నుండి థాయ్‌లాండ్‌కు మారిన పుష్ప స్మగ్లింగ్.. నిజమేనా?
అయితే పుష్ప తొలి భాగం అనుకున్న దానికంటే ఎక్కవ సక్సెస్‌ను అందుకోవడంతో, ఇప్పుడు పుష్ప-2 సినిమాను మరింత గ్రాండియర్‌గా తెరకెక్కించేందుకు సుకుమార్ అండ్ టీమ్ రెడీ అవుతోంది. ఇప్పటికే బన్నీ ఈ సినిమా కోసం తన లుక్‌ను కూడా మార్చుకుంటున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా వినిపిస్తోంది. ఈ సినిమాపై ‘ఆర్ఆర్ఆర్’ ఎఫెక్ట్ ఉండబోతుందట. ఆర్ఆర్ఆర్లో ఎన్టీఆర్ పులితో ఫైట్ చేసిన సీన్ అందరికీ తెలిసిందే. ఇప్పుడు ‘పుష్ప-2’ సినిమాను కూడా అడవి నేపథ్యంలో తెరకెక్కించనుండటంతో, బన్నీ కూడా ఓ పులితో ఫైట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
Pushpa 2 : బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలని బీట్ చేసిన పుష్ప 2
కానీ.. ఆర్ఆర్ఆర్లో ఎన్టీఆర్ గ్రాఫిక్స్ పులితో ఫైట్ చేస్తే, పుష్ప-2 కోసం బన్నీ రియల్ టైగర్‌తో ఫైట్ చేయబోతున్నాడట. దీనికోసం విదేశాల్లో ఫ్రెండ్లీ టైగర్స్‌ని ‘పుష్ప 2’ కోసం రంగంలోకి దింపనున్నారని టాక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన హీరోయిన్గా నటిస్తోండగా, ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేయనున్నారు.