Allu Arjun-Michael: ఇండియన్ మైఖేల్ జాక్సన్ ట్రిబ్యూట్.. సొంత థియేటర్‌లో ‘మైఖేల్’ సినిమా చూసిన బన్నీ.. ఫోటోలు వైరల్
Allu Arjun-Michael Biopic: మైఖేల్ జాక్సన్ బయోపిక్‌ను అల్లు సినిమాస్‌లో చూసిన అల్లు అర్జున్(Allu Arjun).
- V Santhosh Kumar
- Updated on- April 24, 2026 / 03:19 PM IST
Allu Arjun watched the Michael Jackson biopic at Allu Cinemas.
- అల్లు సినిమాస్ లో ‘మైఖేల్’ బయోపిక్
- స్వయంగా వచ్చిన వీక్షించిన అల్లు అర్జున్
- భారీగా పెరిగిన టికెట్ బుకింగ్స్
Allu Arjun – Michael: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు మైఖేల్ జాక్సన్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఆయనను ఒక ఆరాధ్య దైవంలా భావిస్తారు. తాజాగా ఆయన బయోపిక్ ‘మైఖేల్’ థియేటర్స్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ గ్లోబల్ పాప్ ఐకాన్ మైఖేల్ జాక్సన్ బయోపిక్ ‘మైఖేల్’ చిత్రాన్ని తన సొంత మల్టీప్లెక్స్ ‘అల్లు సినిమాస్’లో వీక్షించారు అల్లు అర్జున్. చిన్నప్పటి నుండి మైఖేల్ జాక్సన్ డాన్స్‌ను స్ఫూర్తిగా తీసుకుని ఎదిగిన అల్లు అర్జున్, స్వయంగా థియేటర్‌కు వచ్చి ఈ సినిమాను సెలబ్రేట్ చేసుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
*నితిన్- రితిక నాయక్ కాంబోలో కొత్త మూవీ.. ఇద్దరు డెబ్యూ డైరెక్టర్లతో క్రేజీ ప్రాజెక్ట్
అల్లు అర్జున్(Allu Arjun) సందడి చేయడంతో అల్లు సినిమాస్ వద్ద సందడి నెలకొంది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుండటంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఒక గొప్ప డాన్సర్‌గా తనను ప్రభావితం చేసిన లెజెండ్ కథను బన్నీ ఇలా గౌరవించడం విశేషం. ఈ క్రేజ్ కారణంగానే అల్లు సినిమాస్‌లో ఈ చిత్రానికి రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ నమోదయ్యాయి. మైఖేల్ జాక్సన్ మేనల్లుడు జాఫర్ జాక్సన్ టైటిల్ రోల్‌లో నటించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
ఆంటోని ఫుక్వా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ బయోపిక్, మైఖేల్ జాక్సన్ బాల్యం నుండి ప్రపంచ స్థాయి స్టార్‌గా ఎదిగిన ప్రయాణాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించింది. జాఫర్ జాక్సన్ తన బాబాయ్ పాత్రలో పరకాయ ప్రవేశం చేశారని చూసిన వారు ప్రశంసిస్తున్నారు. అల్లు అర్జున్ వంటి స్టార్ హీరో మద్దతు లభించడంతో ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
