Allu Sneha – Arha : తిరుమలకు కాలి నడకన అల్లు అర్జున్ భార్య, కూతురు.. అర్హ పాప ఎంత క్యూట్ గా ఉందో..

అల్లు స్నేహ, అర్హ, కుటుంబ సన్నిహితులతో నిన్న రాత్రి తిరుమలకు కాలినడకన వెళ్లారు.

  • Updated on- August 6, 2024 / 02:05 PM IST

Allu Arjun Wife Allu Sneha and Daughter Allu Arha Visuals From Tirumala Goes Viral

Allu Sneha – Arha : అల్లు అర్జున్ ఫ్యామిలీతో ఇటీవల యూరప్ దేశాలకు వెకేషన్ వెళ్లి వచ్చారు. వెకేషన్ నుంచి వచ్చాక అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ తో బిజీ అయ్యారు. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో పుష్ప 2 షూటింగ్ జరుగుతుంది. అయితే తాజాగా అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి, కూతురు అర్హ తాజాగా తిరుమలకు వెళ్లారు.

Also Read : Niharika – Chiranjeevi : నిహారిక నిర్మాతగా కమిటీ కుర్రాళ్లు సినిమా.. ఫస్ట్ రివ్యూ చెప్పిన మెగాస్టార్..

అల్లు స్నేహ, అర్హ, కుటుంబ సన్నిహితులతో నిన్న రాత్రి తిరుమలకు కాలినడకన వెళ్లారు. కాలినడక దారిలో తీసిన కొన్ని ఫోటోలు స్నేహ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. ఇవాళ ఉదయం అల్లు స్నేహ, అర్హ, కుటుంబ సభ్యులు వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం నుంచి బయటకు వచ్చాక అల్లు స్నేహ, అర్హ మీడియా ముందుకు వచ్చినా ఏమి మాట్లాడుకుండానే వెళ్లిపోయారు. తిరుమలలో అల్లు స్నేహ, అర్హ విజువల్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అర్హ పాప క్యూట్ గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు బన్నీ ఫ్యాన్స్.