Jr NTR-Allu arjun : కంగ్రాట్స్ బావా అంటూ ఎన్టీఆర్ ట్వీట్.. జెన్యూన్‌గా విష్ చేశావు అంటూ బన్నీ రిప్లై
టాలీవుడ్లో హీరోలందరూ దాదాపుగా స్నేహితులుగానే కలిసి ఉంటారు. ఒకరి సినిమా సక్సెస్ కావాలని మరొకరు కోరుకుంటారు. ఒకరి విజయాన్ని మరొకరు ఆస్వాదిస్తుండటాన్ని చూస్తూనే ఉంటాం.
- Thota Vamshi Kumar
- Updated on- August 24, 2023 / 08:39 PM IST
Allu arjun-Jr NTR
Jr NTR-Allu arjun : టాలీవుడ్లో హీరోలందరూ దాదాపుగా స్నేహితులుగానే కలిసి ఉంటారు. ఒకరి సినిమా సక్సెస్ కావాలని మరొకరు కోరుకుంటారు. ఒకరి విజయాన్ని మరొకరు ఆస్వాదిస్తుండటాన్ని చూస్తూనే ఉంటాం. అభిమానుల మధ్యే విభేదాలు తప్ప తమ మధ్య ఎలాంటివి విభేదాలు ఉండవని పలు సందర్భాల్లో స్టార్ హీరోలు సైతం చెప్పారు. ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్, ఎన్టీఆర్ లు మంచి మిత్రులు అన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
National Film Awards 2023 : మొత్తం 10 నేషనల్ అవార్డులతో తెలుగు సినిమా సత్తా..
భారతీయ సినీ పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2021 సంవత్సరానికి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అల్లు అర్జున్ను వరించింది. పుష్ఫ ది రైజ్ సినిమాలోని పుష్ప రాజ్ పాత్రలో అద్భుతంగా నటించినందుకు బన్నీకి ఈ అవార్డు వచ్చింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఓ నటుడికి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు రావడం ఇదే తొలిసారి. దీంతో సోషల్ మీడియా వేదికగా బన్నీపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
Allu arjun : బెస్ట్ యాక్టర్‌గా అల్లు అర్జున్.. సుకుమార్ ఆనందం చూశారా..!
కాగా.. అందరిలో జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. “కంగ్రాచ్యులేషన్స్ బావా.. పుష్ప సినిమాకు గానూ ఈ విజయం, అవార్డులు నీకు దక్కి తీరాల్సిందే.” అంటూ ట్వీట్ చేశాడు. దీనిపై బన్నీ స్పందించారు. ‘ఎలాంటి కల్మషం లేకుండా జెన్యూన్‌గా విష్ చేసినందుకు చాలా థ్యాంక్స్ బావా. నువ్వు నా హృదయాన్ని టచ్ చేశావు.’ అంటూ అల్లు అర్జున్ రిప్లై ఇచ్చాడు. వీరిద్దరి ట్వీట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
