National Film Awards 2023 : మొత్తం 10 నేషనల్ అవార్డులతో తెలుగు సినిమా సత్తా..

ఈ ఏడాది నేషనల్ అవార్డ్స్ ప్రకటన పై ఎంతో ఉత్కంఠ నెలకుంది. కారణం ఈ ఏడాదిలో తెలుగు నుంచి RRR, పుష్ప (Pushpa 1) వంటి సూపర్ హిట్ పాన్ ఇండియా సినిమాలు ఉండడం. అంతేకాకుండా..

National Film Awards 2023 : మొత్తం 10 నేషనల్ అవార్డులతో తెలుగు సినిమా సత్తా..

10 National Film Awards for telugu movies Pushpa RRR Allu Arjun

National Film Awards 2023 : కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ 69వ జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటించింది. ఈ ఏడాది నేషనల్ అవార్డ్స్ ప్రకటన పై ఎంతో ఉత్కంఠ నెలకుంది. కారణం ఈ ఏడాదిలో తెలుగు నుంచి RRR, పుష్ప (Pushpa 1) వంటి సూపర్ హిట్ పాన్ ఇండియా సినిమాలు ఉండడం. దీంతో టాలీవుడ్ యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ మధ్యనే గట్టి పోటీ కనబడింది.

M M Keeravani : కీరవాణికి ఇది ఎన్నో నేషనల్ అవార్డు తెలుసా..? తెలుగులో ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ జాతీయ అవార్డు అందుకున్నారు..?

ఇప్పటి వరకు ఉత్తమ నటుడు క్యాటగిరిలో టాలీవుడ్ కి ఒక నేషనల్ అవార్డు కూడా రాకపోవడం, ఈసారి బెస్ట్ యాక్టర్ రేసులో రామ్ చరణ్ (Ram Charan), ఎన్టీఆర్ (NTR), పుష్ప నుంచి అల్లు అర్జున్ (Allu Arjun) వంటి బిగ్ స్టార్స్ ఉండడంతో ఆడియన్స్ లో మరింత ఉత్కంఠ నెలకుంది. ఈ ఏడాది జాతీయ పురస్కారంల్లో టాలీవుడ్.. ఒకటి, రెండు కాదు మొత్తం 10 అవార్డులను సొంతం చేసుకుంది.

Allu arjun : బెస్ట్ యాక్ట‌ర్‌గా అల్లు అర్జున్‌.. సుకుమార్ ఆనందం చూశారా..!

ఒక చిన్న సినిమాగా వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్లు కలెక్షన్స్ అందుకున్న ఉప్పెన (Uppena) సినిమా ‘బెస్ట్ ఫీచర్ ఫిల్మ్’గా అవార్డుని అందుకుంది. బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ క్యాటగిరిలో ‘పురుషోత్తమ చార్యులు’ సినిమా అవార్డుని అందుకుంది. ఇక గ్లోబల్ హిట్ సాధించిన RRR చిత్రం ‘బెస్ట్ పాపులర్ ఫిల్మ్’, ‘బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్’, ‘ఉత్తమ గాయకుడు’, ‘బెస్ట్ స్టంట్ మాస్టర్’, ‘బెస్ట్ డాన్స్ కొరియోగ్రాఫర్’, ‘బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్’.. కేటగిరిలో మొత్తం ఆరు అవార్డులను అందుకుంది.

National Film Awards 2023 : బెస్ట్ యాక్టర్‌గా అల్లు అర్జున్‌కి నేషనల్ అవార్డు.. పుష్ప తగ్గేదేలే..

‘కొండపోలం’ సినిమాకు గాను చంద్రబోస్ ‘బెస్ట్ లిరిక్స్’ పురస్కారం అందుకున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే ఉప్పెన, కొండపోలం సినిమాల్లో హీరో వైష్ణవ తేజ్ కావడం గమనార్హం. అలాగే పుష్ప సినిమాకు గాను దేవిశ్రీ ప్రసాద్ కూడా ‘బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్’గా అవార్డుని అందుకున్నాడు. ఇలా ఈ ఏడాది 10 నేషనల్ అవార్డులు రావడం, అలాగే 69 ఏళ్ళగా ఒక ఒక తీరని కలలా ఉన్న బెస్ట్ యాక్టర్ అవార్డుని అల్లు అర్జున్ టాలీవుడ్ కి తీసుకు రావడంతో తెలుగు సినిమా ప్రముఖులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.