Allu Ayaan : అల్లు అయాన్ ఫేవరేట్ హీరో ఎవరో తెలుసా? డ్యాన్స్ లో మాత్రం బన్నీ కాదంట.. ఎవరు మరి?

బాలయ్య కూడా పిల్లలు ఇద్దరితో సరదాగా ఉన్నారు. వాళ్ళని సరదా ప్రశ్నలు అడిగారు.

Allu Ayaan Reveals his Favourite Hero in Balakrishna Unstoppable Show

Allu Ayaan : బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకి అల్లు అర్జున్ వచ్చిన సంగతి తెలిసిందే. గత వారం ఈ ఎపిసోడ్ పార్ట్ 1 రిలీజ్ చేయగా తాజాగా నేడు పార్ట్ 2 రిలీజ్ చేసారు. ఈ ఎపిసోడ్ లో అల్లు అర్జున్ పిల్లలు అల్లు అర్హ, అయాన్ వచ్చి ఫుల్ గా సందడి చేసారు. పొడుపు కథలు అడిగారు, టంగ్ ట్విస్టర్స్ చెప్పారు, అర్హ తెలుగు పద్యం చెప్పింది.. ఇలా పిల్లలు ఫుల్ గా ఎంటర్టైన్ చేసారు.

ఇక బాలయ్య కూడా పిల్లలు ఇద్దరితో సరదాగా ఉన్నారు. వాళ్ళని సరదా ప్రశ్నలు అడిగారు. ఈ క్రమంలో ఇద్దరికీ ఫేవరేట్ హీరో ఎవరని అడిగారు. దీనికి అయాన్.. నాకు యాక్షన్ లో ప్రభాస్ ఇష్టం. డ్యాన్స్ లో మాత్రం చిరు తాత ఇష్టం. నాకు బాహుబలి సినిమా బాగా నచ్చింది అందుకే ప్రభాస్ ఇష్టం అని చెప్పాడు. ఇక అర్హ మాత్రం నేను శకుంతలంలో అబ్బాయిగా నటించాను అదే నా ఫేవరేట్ అని చెప్పడం గమనార్హం. అలాగే అల్లు అయాన్ తన ఫేవరేట్ డైరెక్టర్ బోయపాటి అని చెప్పాడు.

Also Read : Thandel Song : ‘తండేల్’ నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. బుజ్జితల్లి కాస్త నవ్వవే..

దీంతో అయాన్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఫేవరేట్ హీరో ప్రభాస్ అని చెప్పడం, డ్యాన్స్ లో మాత్రం మెగాస్టార్ పేరు చెప్పడంతో మెగా ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ అయాన్ ని తెగ పొగుడుతున్నారు. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.