Thandel Song : ‘తండేల్’ నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. బుజ్జితల్లి కాస్త నవ్వవే..
తాజాగా తండేల్ సినిమా నుంచి మొదటి పాట రిలీజ్ చేసారు.

Naga Chaitanya Sai Pallavi Thandel Movie First Song Released
Thandel Song : నాగచైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘తండేల్’. గీత ఆర్ట్స్ బ్యానర్ లో బన్నీ వాసు నిర్మాణంలో ఈ సినిమా భారీగా తెరకెక్కుతుంది. శ్రీకాకుళంకు చెందిన మత్స్యకారుల రియల్ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉందని సమాచారం. తండేల్ సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది.
Also Read : Allu Sneha- Allu Arha : అల్లు అర్హ బర్త్ డే.. స్పెషల్ పోస్ట్ షేర్ చేసి విషెస్ చెప్పిన స్నేహ రెడ్డి..
ఇప్పటికే తండేల్ నుంచి టీజర్ రిలీజ్ చేసి సినిమాపై మంచి అంచనాలు నెలకొల్పారు. అలాగే సాయి పల్లవితో నాగ చైతన్య మంచి లవ్ స్టోరీ సినిమాలో ఉండనుందని తెలుస్తుంది. గతంలో టీజర్ చివర్లో బుజ్జితల్లి వచ్చేస్తున్నానే.. కూసింత నవ్వవే.. అని సాయి పల్లవి నవ్వుతో వచ్చిన వీడియో బాగా వైరల్ అయింది. తాజాగా తండేల్ సినిమా నుంచి మొదటి పాట రిలీజ్ చేసారు. మీరు కూడా ఈ పాటను వినేయండి..
ఇక ఈ పాటను శ్రీమణి రాయగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో జావేద్ అలీ పాడాడు. ప్రస్తుతం ఈ పాట వైరల్ గా మారింది. ఈ సాంగ్ లో చైతన్య, సాయి పల్లవి పాత్రల మధ్య ప్రేమను, సాయి పల్లవి చైతన్య కోసం ఎదురుచూస్తున్నట్టు చూపించారు.