Allu Studios: అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘అల్లు ఫిల్మ్ స్టూడియోస్’ ప్రారంభం..
- sekhar
- Published On : October 1, 2020 / 02:46 PM IST
Allu Studios – Allu Family: తెలుగు తెరపై హస్యపు జల్లు అల్లు అనే నానుడికి తెరతీసిన పద్మశ్రీ.. శ్రీ అల్లు రామలింగయ్య గారి 99వ జయంతి నేడు (అక్టోబర్ 1).. ఈ సందర్భంగా అల్లు కుటుంబ సభ్యులు ఆయనకు ఘన నివాళులర్పించారు.
అలాగే అల్లు జయంతి నాడు ఓ ప్రత్యేకమైన ప్రకటన చేశారు.. అల్లు స్ఫూర్తితో సినీ రంగప్రవేశం చేసిన తాము ఆయన లెగసీను కంటిన్యూ చేస్తూ వారి జ్ఞాపకార్థం ‘అల్లు స్టూడియోస్’ ను ప్రారంభిస్తున్నామని ఈ సందర్భంగా ప్రకటించారు.
అతి పెద్ద ఫిల్మ్ షూటింగ్ స్టూడియో ‘అల్లు స్టూడియోస్’ ను ఈ ప్ర్యతేకమైన రోజు ప్రారంభించారు. త్వరలో అత్యాధునిక సాంకేతిక హంగులతో ప్రతిష్టాత్మకంగా స్టూడియో నిర్మాణం చేపడతామని ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అల్లు బాబీ(వెంకటేష్), అల్లు శిరీష్ తెలిపారు. వచ్చే ఏడాది అల్లు శత జయంతిని ఘనంగా నిర్వహించనున్నారు.
