×
Ad

Allu Sirish : పాపం అల్లు శిరీష్ ఎన్ని కలలు కన్నాడు.. ఒక్క దెబ్బకు మొత్తం చెల్లాచెదురైంది..

ఇటీవలే కొన్నిరోజుల క్రితం అల్లు శిరీష్ తను నైనికా అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని, ఇంట్లో ఒప్పుకున్నారని, త్వరలోనే నిశ్చితార్థం చేసుకోబోతున్నాం అని ప్రకటించాడు. (Allu Sirish)

Allu Sirish Engagement

Allu Sirish : టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో అల్లు శిరీష్ ఒకరు. ఇటీవలే కొన్నిరోజుల క్రితం అల్లు శిరీష్ తను నైనికా అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని, ఇంట్లో ఒప్పుకున్నారని, త్వరలోనే నిశ్చితార్థం చేసుకోబోతున్నాం అని ప్రకటించాడు. ఫేస్ రివీల్ చేయకుండా అల్లు శిరీష్ ప్రకటించినా ఇటీవల దీపావళి సెలబ్రేషన్స్ ఫొటోల్లో అల్లు అర్జున్ భార్య స్నేహ నైనికా ఫేస్ రివీల్ చేసేసింది.

అల్లు శిరీష్ నిశ్చితార్థం అక్టోబర్ 31న జరగాల్సి ఉంది. హైదరాబాద్ లోని తమ సొంతింట్లోనే ఈ నిశ్చితార్థ వేడుకకు ప్లాన్ చేసారు. అయితే అల్లు శిరీష్ తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. వర్షం పడుతుండగా డెకరేషన్ వర్క్స్ ఫోటో తీసి.. చలికాలంలో అవుట్ డోర్ లో నిశ్చితార్థం ప్లాన్ చేసుకున్నాను. కానీ వాతావరణం, దేవుడికి వేరే ప్లాన్స్ ఉన్నాయి అని పోస్ట్ చేసాడు.

Also Read : Samantha : సమంత సినిమాలు రష్మికకు వెళ్తున్నాయా? మొన్న బాలీవుడ్ సినిమా.. ఇప్పుడు టాలీవుడ్ సినిమా..

అల్లు శిరీష్ తన నిశ్చితార్థాన్ని బయట మంచి డెకరేషన్ స్టేజిపై చేసుకుందామని ప్లాన్ చేసుకున్నాడు. కానీ తుఫాన్ ఎఫెక్ట్ తో హైదరాబాద్ లో కూడా ఫుల్ వర్షాలు పడి డెకరేషన్ వర్క్ ఆగిపోయింది. అందుకే అల్లు శిరీష్ ఈ పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ వైరల్ గా మారడంతో పాపం అల్లు శిరీష్ తన నిశ్చితార్థం కోసం ఎన్ని ప్లాన్స్ వేశాడో, ఓపెన్ ప్లేస్ లో, వెన్నెల వెలుతురులో గ్రాండ్ గా చేసుకుందాం అనుకున్నాడు,  వర్షం దెబ్బకు అన్ని చెల్లాచెదురయయ్యాయి అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

అయితే వర్షం ఎఫెక్ట్ తగ్గితే బయట డెకరేషన్ చేసి శిరీష్ – నైనికా నిశ్చితార్థం చేసుకుంటారని లేకపోతే ఇంట్లోనే సింపుల్ గా చేసుకుంటారని తెలుస్తుంది. నిశ్చితార్థ వేడుక కేవలం రెండు కుటుంబాలు మధ్యే జరగనున్నట్టు సమాచారం.

Also See : Jabardasth Rocking Rakesh : ఫ్యామిలీతో కలిసి గో పూజలో పాల్గొన్న జబర్దస్త్ రాకింగ్ రాకేష్.. ఫొటోలు వైరల్..