Allu Sirish : టెడ్డి బేర్‌తో అల్లు శిరీష్ యాక్షన్.. కొత్త కాన్సెప్ట్‌తో గ్లింప్స్ అదిరిపోయింది!
అల్లు శిరీష్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఆడియన్స్ ని థ్రిల్ చేయబోతున్నాడు. అమ్మాయిలు ఎంతో ఇష్టపడే టెడ్డి బేర్ తో మెషిన్ గన్ ఫైరింగ్ చేయిస్తూ యాక్షన్ అదరగొడుతున్నాడు.
- gum 95921
- Published On : May 30, 2023 / 05:26 PM IST
Allu Sirish new movie Buddy first glimpse released
Allu Sirish Buddy : అల్లు శిరీష్ పుట్టినరోజు నేడు (మే 30) కావడంతో సినీ సెలబ్రెటీస్ మరియు అభిమానులు తనకి బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ (Ram Charan), సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) శిరీష్ కి సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఈ బర్త్ డే రోజునే శిరీష్ తన కొత్త సినిమాని అనౌన్స్ చేస్తూ ఒక యాక్షన్ గ్లింప్స్ రిలీజ్ చేశాడు. శిరీష్ గత ఏడాది ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు.
Ram Charan : రామ్‌చరణ్ సినిమా అయితేనే థియేటర్‌కి వెళ్తా.. ఆ మూవీ నుంచి తనకి ఫ్యాన్ అయ్యిపోయా.. తేజ!
రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఆ సినిమా మంచి విజయం అందుకుంది. ఇక ఇప్పుడు ఒక యాక్షన్ ఫిలింతో రాబోతున్నాడు. అది కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఆడియన్స్ ని థ్రిల్ చేయబోతున్నాడు. అమ్మాయిలు ఎంతో ఇష్టపడే టెడ్డి బేర్ తో కలిసి యాక్షన్ సీన్స్ చేస్తూ అదరగొడుతున్నాడు. తమిళ డైరెక్టర్ సామ్ అంటోన్ దర్శకత్వంలో శిరీష్ ‘బడ్డీ’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. ఆ గ్లింప్స్ చూస్తుంటే.. ఒక ప్రాణం ఉన్న టెడ్డి బేర్ కోసం ఒక మాఫియా గ్యాంగ్ వెతుకుతూ ఉంటుంది. ఆ టెడ్డి బేర్ ని అల్లు శిరీష్ కాపాడుతూ కనిపిస్తున్నాడు.
Mahesh Babu : నా హీరోల్లో మహేష్ బాబు బెస్ట్.. నేను అనుకున్న రియాక్షన్ కరెక్ట్‌గా ఇచ్చేవాడు.. తేజ!
ఇక గ్లింప్స్ అంటూ ఒక కంప్లీట్ ఫైట్ సీన్ ని రిలీజ్ చేసేశారు మేకర్స్. గ్లింప్స్ ఎండ్ టెడ్డి బేర్ మెషిన్ గన్ తో ఫైర్ చేయడం అందర్నీ ఆకట్టుకునేలా ఉంది. ఈ గ్లింప్స్ ఆడియన్స్ లో మూవీ పై క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. తమిళ నిర్మాతలు కే ఇ జ్ఞానవేల్ రాజా, ఆధాన జ్ఞానవేల్ రాజా.. స్టూడియో గ్రీన్ బ్యానర్ లో ఇ సినిమాని తెరకెక్కిస్తున్నారు. తమిళ మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమిజా సంగీతం అందిస్తున్నాడు. చూస్తుంటే తెలుగు, తమిళ భాషల్లో బై లింగువల్ గా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది.
