×
Ad

Allu Sirish : అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ పార్టీ.. స్పెషల్ గ్రూప్ ఫోటో వైరల్.. మళ్ళీ అయ్యప్ప మాలలో చరణ్..

ఈ క్రమంలో స్పెషల్ గ్రూప్ ఫోటో వైరల్ గా మారింది. (Allu Sirish)

  • Published On : February 21, 2026 / 09:34 AM IST

Allu Sirish

Allu Sirish : అల్లు శిరీష్ పెళ్లి తను ప్రేమించిన అమ్మాయి నయనికతో మార్చ్ 6 న జరగనుంది. ఇప్పటికే పెళ్లి పనులు మొదలయ్యాయి. వెడ్డింగ్ కార్డ్స్ పంచిపెడుతున్నారు. ప్రీ వెడ్డింగ్ పార్టీలు జరుపుకుంటున్నారు. తాజాగా అల్లు అర్జున్ తన తమ్ముడి పెళ్లి ప్రీ వెడ్డింగ్ పార్టీ నిర్వహించాడు.(Allu Sirish)

ఈ పార్టీకి పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ క్రమంలో స్పెషల్ గ్రూప్ ఫోటో వైరల్ గా మారింది.

Also Read : Lavanya Tripathi : డాక్టర్ చెప్పినా కూడా ప్రగ్నెన్సీలో షూటింగ్ చేసిన మెగా కోడలు.. పాపం వాంతులు, మైగ్రేన్..

ఈ ఫొటోలో అల్లు శిరీష్, అతనికి కాబోయే భార్య నయనిక, అల్లు అర్జున్, అతని వైఫ్ స్నేహారెడ్డి, రామ్ చరణ్ అతని వైఫ్ ఉపాసన ఉన్నారు. ఇలా కజిన్స్ అంతా కలిసి దిగిన గ్రూప్ ఫోటో వైరల్ గా మారింది. ఈ పార్టీకి అందరూ బ్లాక్ డ్రెస్ లో మెరిపిస్తూ వచ్చారు.

అయితే ఈ ఫొటోతో రామ్ చరణ్ మరోసారి అయ్యప్ప మాల వేసుకున్నట్టు తెలుస్తుంది. చరణ్ రెగ్యులర్ గా కుదిరినప్పుడల్లా అయ్యప్ప మాల వేస్తారని తెలిసిందే. మరోసారి అయ్యప్ప మాలలో కనిపించారు. అల్లు – మెగా ఫ్యాన్స్ ఈ ఫోటోని వైరల్ చేస్తున్నారు.

Also Read : Anupama Parameswaran : ఏంటి నిజమేనా..? తనకన్నా రెండేళ్లు చిన్నవాడితో అనుపమ ప్రేమాయణం..?