Allu Sirish : సోషల్ మీడియాకి దూరం అవుతున్న అల్లు శిరీష్
నిన్న అల్లు శిరీష్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. 'ఈ ఏడాది నవంబర్ 11వ తేదీ నాకు చాలా ప్రత్యేకమైంది. నా వృత్తిజీవితంలోనే ఇది మర్చిపోలేని రోజు అవుతుంది. ఎందుకనుకుంటున్నారా? అది రాను
- Saketh U
- Updated on- November 12, 2021 / 07:05 AM IST
Allu Sirish
Allu Sirish : అల్లు అరవింద్ తనయుడిగా, అల్లు అర్జున్ తమ్ముడిగా తెరంగ్రేటం చేసినా అల్లు శిరీష్ కు అనుకున్నంత సక్సెస్ అయితే రాలేదు. ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాడు శిరీష్. ఇటీవలే అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా ‘Prema కాదంట’ అనే సినిమాని అనౌన్స్ చేశారు. తాజాగా మరో సినిమా ఓకే అయినట్టు తెలుస్తుంది.
Radheshyam : ‘రాధేశ్యామ్’ దర్శక నిర్మాతలకు ప్రభాస్ ఫ్యాన్ సూసైడ్ లేఖ.. నా చావుకి కారణం మీరే
నిన్న అల్లు శిరీష్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ‘ఈ ఏడాది నవంబర్ 11వ తేదీ నాకు చాలా ప్రత్యేకమైంది. నా వృత్తిజీవితంలోనే ఇది మర్చిపోలేని రోజు అవుతుంది. ఎందుకనుకుంటున్నారా? అది రానున్న రోజుల్లో నేనే చెప్తాను. అప్పటివరకు కొన్ని కారణాల వల్ల సోషల్ మీడియాకు దూరంగా ఉంటాను అని పోస్ట్ చేసాడు.
Mahesh Babu : త్వరలో కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల పాఠశాలకు వస్తాను : మహేష్ బాబు
దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అందులో కొన్ని కామెంట్స్ కి రిప్లై కూడా ఇచ్చాడు అల్లు శిరీష్. కొంతమంది ‘అన్నా లవ్ సెట్ అయిందా? పెళ్లి కుదిరిందా?’ అని అడగగా… నేను వృత్తిపరంగా స్పెషల్ డే అని మరీ మరీ చెప్పాను సామీ అని సరదాగా రిప్లై ఇచ్చాడు శిరీష్. మరో నెటిజన్ ‘ఏంటన్నా? బాలీవుడ్ కి వెళ్తున్నావా?’ అని అడగడంతో… నాకు అలాంటి ఆశయాలేమీ లేవు బ్రో, నా కొత్త సినిమా ఫిక్స్ అయింది, కథ నచ్చింది అన్న ఆనందం. నా కెరీర్‌లో ఇది బెస్ట్ స్క్రిప్ట్ అవుతుందనుకుంటున్నా అంటూ అసలు మ్యాటర్ నిన్నే చెప్పేశాడు. దీంతో అల్లు శిరీష్ ఈ సినిమా అయ్యేదాకా సోషల్ మీడియాకి దూరంగా ఉంటాడు అని అర్ధమవుతుంది.
