Allu Sirish : టికెట్ రేట్లు ఎక్కువ ఉండటం వల్లే జనాలు థియేటర్స్‌కి రావట్లేదు.. అల్లు శిరీష్ వ్యాఖ్యలు వైరల్..

తాజాగా హీరో అల్లు శిరీష్ టికెట్ రేట్లపై మాట్లాడటంతో టాలీవుడ్ లో చర్చగా మారింది.

Allu Sirish Sensational Comments on Movie Ticket Rates

Allu Sirish : ఇటీవల సినిమా టికెట్ రేట్లు బాగా పెరిగిన సంగతి తెలిసిందే. సింగిల్ స్క్రీన్స్ లో మినిమమ్ 150 నుంచి మల్టీప్లెక్స్ లో మినిమమ్ 350 నుంచి 500 వరకు టికెట్ రేట్లు ఉంటున్నాయి. ఇలాంటి సమయంలో అల్లు శిరీష్ తన సినిమా టికెట్ రేట్లను బాగా తగ్గించి వస్తున్నాడు.

అల్లు శిరీష్, గాయత్రీ భరద్వాజ్ జంటగా స్టూడియో గ్రీన్ ఫిల్మ్స్ నిర్మాణంలో సామ్ అంటోన్ ద‌ర్శ‌క‌త్వంలో అజ్మల్ అమీర్, ప్రిషా సింగ్, ముఖేష్ రిషి, అలీ.. ముఖ్య పాత్రలతో తెరకెక్కిన బడ్డీ సినిమా ఆగస్టు 2న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమాకు సింగిల్ స్క్రీన్స్ లో కేవలం 99 రూపాయలు, మల్టీప్లెక్స్ థియేటర్స్ లో కేవలం 125 రూపాయలు మాత్రమే టికెట్ రేటు పెట్టారు. దీంతో ఇటీవల అందరూ కనీసం 200 అయిన టికెట్ రేటు పెడుతుంటే శిరీష్ ఎందుకు మరీ ఇంత తక్కువ పెట్టాడు అని అంతా చర్చించుకుంటున్నారు.

Also Read : Gaddar Awards – Tollywood : సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ.. గద్దర్ అవార్డ్స్ గురించి త్వరలో..

తాజాగా బడ్డీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు శిరీష్ టికెట్ రేట్లు ఎందుకు తగ్గించాడో తెలిపాడు. అల్లు శిరీష్ మాట్లాడుతూ.. ఈ సినిమాని ఎక్కువమంది చూడాలని తక్కువ రేట్లు పెట్టాను. ఎక్కువ రేటు పెట్టడం వల్ల థియేటర్ కి వచ్చి చూద్దాం అనుకున్నవాళ్ళు కూడా రావట్లేదు. నేను కొంతమందిని చూసాను. ఒక సినిమా ట్రైలర్స్, టీజర్స్, సాంగ్స్ నచ్చినా టికెట్ రేటు 300 పైన ఉంది అని థియేటర్ కి వెళ్లట్లేదు. ఒక వారం అయ్యాక 100 లేదా 150 కి వస్తుంది కుదిరితే అప్పుడు చూద్దాం అనుకుంటున్నారు. నేను అది గమనించాను. టికెట్ రేట్లు పెరగడం వల్ల ఆడియన్స్ చాలామంది ఆగిపోతున్నారు. అందుకే ఎక్కువమంది ఆడియన్స్ రావడానికే టికెట్ రేట్లు తగ్గించాము అని తెలిపారు.

టికెట్ రేట్ల పెంపు నష్టమే అని ఎప్పట్నుంచో సినీ పరిశ్రమలో చర్చ నడుస్తుంది. కానీ ఇటీవల ప్రతి స్టార్ హీరో సినిమాకు టికెట్ రేట్లు పెంచుతున్నారు. తాజాగా హీరో అల్లు శిరీష్ టికెట్ రేట్లపై ఇలా మాట్లాడటంతో టాలీవుడ్ లో చర్చగా మారింది.

ట్రెండింగ్ వార్తలు