Ameerlog : దర్శకుడిగా మారిన ఆర్కిటెక్ట్.. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ సినిమాతో..
సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు రమణా రెడ్డి సోమ నేడు మీడియాతో మాట్లాడారు. (Ameerlog)
- Saketh U
- Published on- August 18, 2026 / 03:20 PM IST
Ameerlog
Ameerlog : అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పి బ్యానర్ పై మాధవి రెడ్డి సోమ నిర్మాణంలో రమణా రెడ్డి సోమ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అమీర్ లోగ్’. ఎంసీ హరి, మనోజ్, శశిధర్ హీరోలుగా నటించగా వేద జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయియోగి.. పలువురు కీలక పాత్రలు పోషించారు. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ యూత్, ఫ్రెండ్షిప్ కథతో ఈ సినిమా రాబోతుంది. రానా దగ్గుబాటి సంస్థ స్పిరిట్ మీడియా ఈ సినిమాని ఆగస్ట్ 21న థియేటర్స్ లో రిలీజ్ చేస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు రమణా రెడ్డి సోమ నేడు మీడియాతో మాట్లాడారు.
దర్శకుడు రమణా రెడ్డి సోమ తన జర్నీ గురించి మాట్లాడుతూ.. మాది నల్గొండ. 1997లోనే ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌కి వచ్చాను. జేఎన్టీయూలో ఆర్టిటెక్ట్ చదివాను. 2007లో ఆర్కిటెక్ట్ గా కంపెనీ మొదలుపెట్టాను. కరోనా సమయంలో ఖాళీగా ఉండటంతో ఎక్కువ సినిమాలు చూసి రాయడం నేర్చుకున్నాను. నా సొంత అనుభవాలు, చూసిన, విన్న వాటి నుంచి రాసేవాడ్ని. యూట్యూబ్ ద్వారా, సీరియల్స్ లో ఉన్న నా ఫ్రెండ్ ద్వారా సినిమాలకు రాయడం నేర్చుకున్నాను. మూడేళ్ల క్రితం ఒక షార్ట్ ఫిల్మ్ తీశాను. ఓ పాడ్ కాస్ట్‌లో మనోజ్ బాజ్‌పేయి మాట్లాడుతూ అమీర్ లోగ్ అనే పదం వాడారు. ఆ పదం నచ్చి దాని చుట్టూ కథ రాసుకొని సినిమా చేయాలనుకున్నాను అని తెలిపారు.
Also Read : Chennai Love Story : ప్రేక్షకులను ఏడిపించి హిట్ కొట్టిన సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది.. ఎప్పుడు? ఎక్కడ?
అమీర్ లోగ్ సినిమా గురించి మాట్లాడుతూ.. ఓ బస్తీ, ముగ్గురు కుర్రాళ్లు అని కథను రాయడం మొదలుపెట్టాను. హైదరాబాద్ బస్తీలని అద్బుతంగా చూపించాలని అనుకున్నాను. డెమో షూటింగ్ చేసి చాలా మందికి చూపించాం. నిర్మాతలు ఎవరూ ముందుకు రాకపోవడంతో నేనే నిర్మాతగా మారాను. సింక్ సౌండ్ తోనే షూటింగ్ చేసాము. దాదాపు మా సినిమాని బస్తీల్లోనే షూటింగ్ చేసాము. బస్తీలోనే 38 రోజులు షూటింగ్ చేశాం. నైట్ టైం కూడా షూట్ ఉంది. మా షూటింగ్ వల్ల బస్తీ వాళ్లు కాస్త ఇబ్బంది పడ్డారు కానీ సపోర్ట్ చేసారు. ఇందులో హైదరాబాద్ ఉర్దూ ఉంటుంది. భాష అర్ధం కాకపోయినా భావం అర్ధం అవుతుంది. రియాలిటీకి దగ్గరగా ఉండాలనే ఆ ఉర్దూ యాస పెట్టాము. ఈ సినిమాలో ఏకంగా పది పాటలు ఉన్నాయి. క్లామాక్స్ లో ఓ దావత్ సాంగ్ అదిరిపోతుంది అని తెలిపారు.
రానా సంస్థ ఈ సినిమా రిలీజ్ చేయడంపై మాట్లాడుతూ.. అమీర్ లోగ్ సినిమాని స్పిరిట్ టీంకి చూపించాం. ఫస్ట్ హాఫ్ చూసే బాగుందని అన్నారు. సెకండాఫ్‌కి ఆడియెన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి రానా గారి టీం నన్ను పిలిచి మాట్లాడారు.
