Chennai Love Story : ప్రేక్షకులను ఏడిపించి హిట్ కొట్టిన సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది.. ఎప్పుడు? ఎక్కడ?
Chennai Love Story
Kiran Abbavaram Chennai Love Story
Chennai Love Story : కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీప్రియ జంటగా తెరకెక్కిన చెన్నై లవ్ స్టోరీ సినిమా ఇటీవల జులై 24న థియేటర్స్ లో రిలీజయి మంచి విజయం సాధించింది. SKN, సాయి రాజేష్, ధీరజ్ మొగిలినేని నిర్మాణంలో రవి నంబూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. థియేటర్స్ లో మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకొని ప్రేక్షకులను ఎమోషనల్ స్టోరీతో ఏడిపించి పెద్ద విజయం సాధించి కిరణ్ కెరీర్లో మరో హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమా థియేటర్స్ లో దాదాపు 60 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
లవ్, కామెడీ, ఎమోషనల్ కథాంశంతో చెన్నై బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన చెన్నై లవ్ స్టోరీ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. చెన్నై లవ్ స్టోరీ సినిమా ఆగస్టు 21 నుంచి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్స్ లో మిస్ అయినవాళ్లు ఓటీటీలో ఈ సినిమాని చూడొచ్చు.
Also Read : Shravan Reddy : నగ్నంగా నటించి.. నెగిటివ్ షేడ్స్, డ్యూయల్ రోల్ లో అదరగొట్టాడుగా..
ఓటీటీ స్ట్రీమింగ్ ప్రకటన సందర్భంగా హీరో కిరణ్ అబ్బవరం మీడియాతో మాట్లాడుతూ.. ఫస్ట్ లవ్‌తో ముడిపడిన అమాయకత్వం, ఉత్సాహం, భావోద్వేగాలను ఎంతో అందంగా చూపించిన సినిమా ‘చెన్నై లవ్ స్టోరీ’. ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకమైనది. ఇప్పుడు ఈ సినిమా సోనీ లివ్ ద్వారా వివిధ ప్రాంతాలు, భాషలకు చెందిన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని తెలిపారు.

