Ameerlog : అమీర్ లోగ్ ముగ్గురు హీరోలు.. MC హరి, మనోజ్, శశిధర్.. సినిమా గురించి ఏం చెప్పారంటే..
ఈ సినిమా హీరోలు MC హరి, మనోజ్, శశిధర్ నేడు మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించి పలు విశేషాలు తెలిపారు. (Ameerlog)
- Saketh U
- Published on- August 16, 2026 / 05:42 PM IST
Ameerlog
Ameerlog : అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పి బ్యానర్ పై మాధవి రెడ్డి సోమ నిర్మాణంలో రమణా రెడ్డి సోమ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అమీర్ లోగ్’. ఎంసీ హరి, మనోజ్, శశిధర్ హీరోలుగా నటించగా వేద జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయియోగి.. పలువురు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్, టీజర్, ట్రైలర్ రిలీజ్ చేసారు. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ యూత్, ఫ్రెండ్షిప్ కథతో ఈ సినిమా రాబోతుందని తెలుస్తుంది. రానా దగ్గుబాటి సంస్థ స్పిరిట్ మీడియా ఈ సినిమాని ఆగస్ట్ 21న థియేటర్స్ లో రిలీజ్ చేస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా హీరోలు MC హరి, మనోజ్, శశిధర్ నేడు మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించి పలు విశేషాలు తెలిపారు.
Also See : Trisha: చీరకట్టులో త్రిష.. ఎంత అందంగా ముస్తాబయిందో..
సినిమా గురించి మాట్లాడుతూ.. అమీర్ లోగ్ చాలా నేచురల్‌గా ఉంటుంది. హైదరబాద్ బస్తీలోకి వెళ్లినట్టు, ఆ బస్తీల్లో జీవిస్తున్నట్టు అనిపిస్తుంది. మా డైరెక్టర్ గారి అత్తగారి ఇల్లు, బస్తీల్లోనే షూటింగ్ చేశాం. సింక్ సౌండ్‌లో ఈ మూవీని చేశాం. అందుకే ఏ చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా షూటింగ్ ఆపేవాళ్లం. పైనా విమానం వెళ్లినా, ఏసీ సౌండ్ వచ్చినా కూడా ఆపేవాళ్లం. రోడ్ల మీద తీసిన సీన్లకు మాత్రమే డబ్బింగ్ చెప్పాం. మేం బస్తీల్లోనే పెరిగాం. తెలంగాణ యాస, బస్తీ లైఫ్ కథ అవ్వడంతో మాకు చాలా సులభంగా మారింది. మా పాత్రలు రియల్ లైఫ్ కారెక్టర్స్‌కి దగ్గరగా అనిపించాయి. అమీర్ లోగ్ సినిమాలో బిర్యానీ అనేదే మెయిన్ పాయింట్. ఆ బిర్యానీ చుట్టూనే మా పాత్రలు తిరుగుతాయి. ఫస్ట్ హాఫ్‌ని చూస్తే బిర్యానీ వాసన వస్తుంది. సెకండాఫ్‌లో బిర్యానీ టేస్ట్ తెలుస్తుంది. క్లైమాక్స్‌కి కడుపు నిండినట్టు అనిపిస్తుంది అని తెలిపారు.
అలాగే.. తెరపై మేం ముగ్గురం ఎక్కువగా కనిపించినా మా సినిమాలో మహిళా పాత్రలే కీలకంగా ఉంటాయి. సినిమా చూశాక మా అందరికీ ఎంతో కాన్ఫిడెంట్ వచ్చింది. రానా గారి టీం మా సినిమాని చూసి రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో హిందీ ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ, హైదరాబాద్ అంటే తెలీకుండానే కొన్ని పదాల్లో హిందీ, ఉర్దూ వచ్చేస్తుంది. ఇక్కడి భాషకి, యాసకి అడ్రెస్‌లా మా అమీర్ లోగ్ సినిమా ఉంటుంది. భాష, యాసతో సంబంధం లేకుండా ఎమోషన్స్ మాత్రం అందరికీ కనెక్ట్ అవుతాయి అని తెలిపారు.
