×
Ad

Bro Movie : బ్రో శ్లోకంకి టెస్లా కారుల లైట్ షో సూపర్.. వైరల్ అవుతున్న వీడియో చూశారా..?

పవన్ అండ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న బ్రో మూవీ శ్లోకానికి అమెరికన్ ఫ్యాన్స్ టెస్లా కారులతో లైట్ షో నిర్వహించి అదరగొట్టారు. ఆ వీడియో చూశారా..?

  • Published On : July 24, 2023 / 04:15 PM IST

American fans conduct light show with Tesla cars for Bro Slokam

Bro Movie : సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మెయిన్ లీడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఒక ముఖ్య పాత్రలో కనిపిస్తూ చేస్తున్న సోషియో ఫాంటసీ మూవీ బ్రో. సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో కేతిక శర్మ (Ketika Sharma), ప్రియా ప్రకాష్ వారియర్, బ్రహ్మానందం ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ నెల 28న గ్రాండ్ గా ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో తెగ సందడి చేస్తుంది.

Indra : 21 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఇంద్ర.. అప్పటి రికార్డులు.. కేవలం 5 టికెట్స్ 10 వేల రూపాయిలకి కొన్నారు..

అలాగే అభిమానులు కూడా సినిమాని ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికన్ ఫ్యాన్స్ టెస్లా కారులతో లైట్ షో నిర్వహించి అదరగొట్టారు. బ్రో కోసం థమన్ ఇచ్చిన ఎలక్ట్రీఫైయింగ్ శ్లోకంకి టెస్లా కారులతో లైట్ షో చేస్తూ సూపర్ అనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోని నెట్టింట పోస్ట్ చేయగా.. ప్రస్తుతం అది వైరల్ అవుతుంది. మరి మీరు కూడా ఒకసారి ఆ లైట్ షో చూసేయండి.

Allu Arjun : వేదిక ఏదైనా ఐకాన్ స్టార్ ఫాలోయింగ్ మాత్రం తగ్గేదేలే.. మొదటి ఇండియన్ యాక్టర్‌గా రికార్డు..

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు జులై 25న హైదరాబాద్ లోని శిల్ప కళా వేదికలో గ్రాండ్ గా జరగబోతుంది. ఈ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ కూడా రాబోతున్నట్లు మేకర్స్ తెలియజేశారు. కాగా ఈ సినిమా తమిళ్ హిట్ మూవీ వినోదయ సిత్తంకి రీమేక్ గా వస్తుంది. అయితే ఆ మూవీ నుంచి మెయిన్ స్టోరీ లైన్ మాత్రం తీసుకోని త్రివిక్రమ్ శ్రీనివాస్ మొత్తం కథని మార్చేసి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించాడు. గోపాల గోపాల మూవీ తరువాత పవన్ మరోసారి దేవుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఆ మూవీలో హాఫ్ టైం మాత్రమే కనిపించిన పవన్.. ఈ సినిమాలో దాదాపు మూవీ మొత్తం కనిపిస్తాడు.