70 కోట్లు ట్యాక్స్‌ చెల్లించిన అమితాబచ్చన్

  • Publish Date - April 13, 2019 / 04:20 PM IST

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ 2018-19 ఆర్థిక సంవత్సరానికి 70 కోట్లు ట్యాక్స్‌ చెల్లించారు. అమితాబచ్చన్ ఆర్థిక వ్యవహారాలు చూసుకునే వ్యక్తి ఈ విషయాన్ని వెల్లడించారు. 70 కోట్ల మెగా పన్ను చెల్లించడంతో పాటు ఈ సంవత్సర కాలంలో అమితాబచ్చన్ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముజఫర్ నగర్ లోని 2084 మంది రైతుల రుణాలన్నింటిని కూడా పూర్తిగా చెల్లించాడు. అలాగే పుల్వామా ఉగ్ర దాడిలో మృతి చెందిన వీర సైనికుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి పది లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించాడు. ఇవే కాకుండా ఎన్నో సేవా, స్వచ్చంద సంస్థలకు విరాళాలు  కూడా ఇచ్చాడు అమితాబచ్చన్.