డైనమిక్ ఉమెన్ లీడర్ ఎమ్మెల్యే రోజా.. మైకు ముందుకొస్తే ప్రత్యర్ధులను చెడుగుడు ఆడుకుంటుంది. అయితే ఎమ్మెల్యే రోజాను మాత్రం ఓ పిల్లోడు ఎదిరించేశాడు. ఆ పిల్లోడు ఎవరో కాదు.. రోజా కుమారుడే. మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్వహించే సంక్రాంతి స్పెషల్ కార్యక్రమం అమ్మ నాన్నా ఓ సంక్రాంతి కార్యక్రమం.
ఈ కార్యక్రమంలోనే ఈ సరాదా ఘటన జరిగింది. ఈ కార్యక్రమం తొలి ప్రోమోలో ఎమ్మెల్యే కొడుకు కిడ్నాప్ అంటూ హడావిడి చేస్తూ మొదలెట్టిన ఆర్కే రోజా.. షో యాంకర్‌గా వ్యవహరిస్తున్న ప్రదీప్‌ను.. నీకు పెళ్లి అయి ఉంటే నా ప్రోగ్రామ్ కు వచ్చేవాడివి. అంటూ బతుకు జట్కా బండిని గుర్తు చేస్తూ చేసిన కామెంట్స్ అందరికి నవ్వు తెప్పించాయి.
తర్వాత జబర్దస్త్ కంటెస్టెంట్స్ పిల్లలతో డిజైన్ చేసిన సంక్రాంతి ప్రోగ్రాం అమ్మ నాన్న సంక్రాంతి షోలో రోజా కుమారుడు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. అంతే కాదు మన దగ్గర బేరాల్లేవమ్మ అంటూ రోజా కుమారుడు డైలాగ్ చెప్పాడు. నువ్వు ప్రతిపక్షం.. నేను అధికారపక్షం.. వార్ బిగిన్స్.. మీ పండగ మీదే మా పండగ మాదే అంటూ గట్టిగా మాట్లాడేశాడు. ఈ ప్రోగ్రామ్ ప్రోమో బాగా నవ్వులు తెప్పించింది. ఆ వీడియో మీరు కూడా ఓసారి చూసెయ్యండి.