Anand Devarakonda : సైకోగా ఆనంద్ దేవరకొండ.. బాలీవుడ్ స్టార్లతో కలిసి కొత్త ప్రయోగం
'118' లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాని తెరకెక్కించిన కేవీ గుహన్ దర్శకత్వంలో ఆనంద్ హీరోగా చేయబోతున్నాడు. సైకో క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ సినిమా టైటిల్ `హైవే`.......
- Saketh U
- Updated on- December 3, 2021 / 08:15 AM IST
Highway
Anand Devarakonda : విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చి కొత్త కొత్త కథలతో దూసుకుపోతున్నాడు యువ హీరో ఆనంద్ దేవరకొండ. ఇటీవలే ‘పుష్పక విమానం’ సినిమాతో ప్రేక్షకులని అలరించాడు. తాజాగా మరో కొత్త కాన్సెప్ట్ సినిమాని అనౌన్స్ చేశాడు ఆనంద్. కళ్యాణ్ రామ్ తో ‘118’ లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాని తెరకెక్కించిన కేవీ గుహన్ దర్శకత్వంలో ఆనంద్ హీరోగా చేయబోతున్నాడు. సైకో క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ సినిమా టైటిల్ `హైవే`. నిన్న ఈ సినిమా టైటిల్ ని అనౌన్స్ చేశారు. దీంతో పాటు ఇందులో నటించే లీడ్ ఆర్టిస్టులను కూడా అనౌన్స్ చేశారు.
Akhanda : దేశ విదేశాల్లో బాలయ్య క్రేజ్.. ఖండాతరాలు దాటిన ‘అఖండం’
ఈ సినిమాలో సైకో గా కనిపించడానికి పూర్తిగా సరికొత్త లుక్‌లో ఆనంద్ దేవరకొండ మారినట్టు తెలుస్తుంది. మలయాళ బ్యూటీ మానస రాధాకృష్ణన్ ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. బాలీవుడ్ బ్యూటీ సయామీఖేర్ ముఖ్య పాత్రలో నటిస్తోంది. ఇటీవలే సయామీ ఖేర్ నాగార్జున ‘వైల్డ్ డాగ్’ సినిమాలో మెరిపించింది. అంతేకాక మీర్జాపూర్, పాతాళ్‌లోక్ వంటి సిరీస్‌లతో తెలుగులోనూ ఫేమస్ అయిన బాలీవుడ్ నటుడు అభిషేక్ బెనర్జీ ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాని నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ పతాకంపై వెంకట్ తలారి నిర్మిస్తున్నారు.
Bigg Boss 5 : షణ్ముఖ్ ప్రియురాలితో సహా శ్రీరామచంద్రకు వెల్లువెత్తుతున్న సెలబ్రిటీల మద్దతు
ఒకరితో ఒకరికి సంబంధం లేని నలుగురు వ్యక్తుల కథే `హైవే’. పూర్తిగా హైవే నేపథ్యంలోనే సాగే సీట్ ఎడ్జ్ థ్రిల్లర్. టెక్నికల్ పరంగా చాలా బాగుంటుందని, ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉందని చిత్ర దర్శకుడు కేవీ గుహన్ ఈ సినిమా గురించి తెలిపారు.
