×
Ad

Anand Devarakonda : రష్మిక మందన్నని ఆనంద్ దేవరకొండ ఏమని పిలుస్తాడో తెలుసా?

తాజాగా మరోసారి రష్మిక - విజయ్ మధ్య ఏదో ఉందని వైరల్ అవుతుంది. కానీ ఈ సారి ఆనంద్ దేవరకొండ వల్ల వైరల్ అవుతున్నారు.

  • Published On : March 15, 2024 / 09:04 PM IST

Anand Devarakonda Rashmika Mandanna Cute Conversation in Social Media goes Viral

Anand Devarakonda : రష్మిక మందన్న(Rashmika Mandanna) – విజయ్ దేవరకొండ మధ్య ఏదో ఉందని, వారు ప్రేమలో ఉన్నారని, డేటింగ్ చేస్తున్నారని వార్తలు వస్తూనే ఉంటాయి. కొన్ని సార్లు అదంతా అబద్దం అని కొట్టేసినా వీరు ఇద్దరు కలిసి పండగలు సెలబ్రేట్ చేసుకున్నట్టు, ట్రిప్స్ కి వెళ్లినట్టు టాక్ రావడం, ఫొటోలతో నెటిజన్లు కనిపెట్టడం, ఇక ఒకరిపై ఒకరు చేసుకునే పోస్టులతో కచ్చితంగా వీరి మధ్య ఏదో ఉందనే అనుకుంటున్నారు అంతా.

తాజాగా మరోసారి రష్మిక – విజయ్ మధ్య ఏదో ఉందని వైరల్ అవుతుంది. కానీ ఈ సారి ఆనంద్ దేవరకొండ వల్ల వైరల్ అవుతున్నారు. నేడు ఆనంద్ దేవరకొండ పుట్టిన రోజు కావడంతో అభిమానులు, నెటిజన్లు, పలువురు ప్రముఖులు అతనికి విషెష్ చెప్తున్నారు. ఈ క్రమంలో రష్మిక మనదన్న కూడా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఆనంద్ దేవరకొండ ఫోటో షేర్ చేసి హ్యాపీ బర్త్ డే ఆనందా.. అని పోస్ట్ చేసింది.

Also Read : Vey Dharuvey : ‘వెయ్ దరువెయ్’ మూవీ రివ్యూ.. సాయిరామ్ శంకర్ రీ ఎంట్రీ మూవీ ఎలా ఉంది?

దీంతో ఈ పోస్ట్ ని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేస్తూ థ్యాంక్యూ రషీ.. కానీ ఈ వరస్ట్ ఫోటో ఎందుకు పెట్టావు అని సరదాగా అన్నాడు. దీనికి రష్మిక మళ్ళీ తన స్టోరీలో రిప్లై ఇస్తూ అందుకే నేను అడిగినప్పుడు మంచిగా పోజ్ ఇమ్మనేది అని సరదాగా పోస్ట్ చేసింది. దీంతో ఆనంద్ రష్మికని క్యూట్ గా రషీ అని పిలుస్తాడని తెలుస్తుంది. వీళ్ళ ఇద్దరి పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

గతంలో కూడా వీరు ఒకరి గురించి ఒకరు పోస్టులు సరదాగా పెట్టుకొని వైరల్ అయ్యారు. దీంతో విజయ్ తోనే కాదు విజయ్ ఫ్యామిలీతో కూడా రష్మికకు మంచి అనుబంధం ఉందని కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఆనంద్ తో రష్మిక ఇప్పటివరకు కలిసి పనిచేయలేదు కానీ ఇంత క్లోజ్ గా, ఒకరికొకరు సరదాగా నిక్ నేమ్స్ పెట్టుకొని పిలుచుకునేంత క్లోజ్ గా మంచి ఫ్రెండ్స్ అయ్యారంటే విజయ్ – రష్మిక మధ్య బాండింగ్ వల్లే అని కామెంట్స్ చేస్తున్నారు.