Baby Movie : అదిరిపోయిన ‘బేబీ’ కలెక్షన్స్.. ఫుల్ ప్రాఫిట్స్.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లు తెలుసా?
బేబీ సినిమాలో స్టార్ హీరోస్, హీరోయిన్స్ ఎవరూ లేకపోయినా, చిన్న సినిమా అయినా కలెక్షన్స్ మాత్రం అదిరిపోతున్నాయి.
- Saketh U
- Published on- July 17, 2023 / 01:11 PM IST
Anand Devarakonda Vaishnavi Chaitanya Baby Movie Three Days Collections
Baby Movie Collections : ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin), ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘బేబీ’. SKN నిర్మాణంలో సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన బేబీ సినిమా జులై 14న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకొని ఈ సినిమా సూపర్ హిట్ అయింది. బేబీ సినిమాకు ముఖ్యంగా యూత్ బాగా కనెక్ట్ అవుతున్నారు. యూత్ లవ్ లో చూసే సమస్యలని, ముఖ్యంగా అబ్బాయిలు చూసే రియల్ సన్నివేశాలని, బ్రేకప్ లని చూపిస్తూ ఈ సినిమాకి తెరకెక్కించారని ప్రేక్షకులు అంటున్నారు.
సినిమా సాంగ్స్, ట్రైలర్ బాగా హిట్ అవ్వడంతో సినిమాపై ముందునుంచే అంచనాలు ఉన్నాయి. దీంతో మొదటి రోజు నుంచే ప్రేక్షకులు భారీగా వచ్చారు. సినిమాలో చాలా సన్నివేశాలు బాగున్నాయని, హీరోయిన్ వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ మాత్రం చాలా బాగా నటించారని అంటున్నారు. ఈ సినిమాలో స్టార్ హీరోస్, హీరోయిన్స్ ఎవరూ లేకపోయినా, చిన్న సినిమా అయినా కలెక్షన్స్ మాత్రం అదిరిపోతున్నాయి. బేబీ సినిమా మొదటి రోజు ఏకంగా 7.1 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక రెండో రోజు కూడా ఆల్మోస్ట్ 7 కోట్లు కలెక్ట్ చేసింది. మూడో రోజు ఆదివారం కావడంతో ఏకంగా 14 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది బేబీ సినిమా.
Ketika Sharma : ‘బ్రో’ సినిమా ప్రమోషన్స్‌లో.. స్టైలిష్ ఫోజులతో కేతిక శర్మ
మొత్తంగా బేబీ సినిమా మూడు రోజుల్లో 23.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఒక చిన్న సినిమాకి మూడు రోజుల్లోనే ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం అంటే గ్రేట్ అని టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇక ఈ సినిమా ఫుల్ రన్ లో 50 కోట్లకు పైగా కలెక్ట్ చేసినా ఆశ్చర్యపోనకవసరం లేదు. ఇప్పటికే సినిమా రిలీజయిన అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ అయి ఫుల్ ప్రాఫిట్స్ తో దూసుకుపోతుంది.
