Rashmika Mandanna : గాయం త‌రువాత మొద‌టిసారి బ‌య‌ట‌కు వ‌స్తున్న ర‌ష్మిక‌.. మ‌రిది కోసం.. ఎప్పుడు, ఎక్క‌డ‌?

ఎపిక్ ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌కు ర‌ష్మిక మంద‌న్న (Rashmika Mandanna) ముఖ్య అతిథిగా వ‌స్తున్నారు.

Anand Deverakonda Epic movie trailer launch event today chief guest Rashmika Mandanna

Rashmika Mandanna : ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వైష్ణ‌వి చైత‌న్య న‌టిస్తున్న చిత్రం ఎపిక్‌. ఆదిత్య హాస‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యాన‌ర్ల‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ, సాయి సౌజ‌న్య‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 11న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది.

అందులో భాగంగా నేడు (సెప్టెంబ‌ర్ 5న‌) ట్రైల‌ర్ ను రిలీజ్ చేయ‌నున్న‌ట్లు తెలిపారు. హైద‌రాబాద్‌లోని ఐటీసీ కొహినూర్‌లో సాయంత్రం 6 గంట‌ల నుంచి ట్రైల‌ర్ లాంఛ్‌ను నిర్వ‌హించ‌న‌ట్లు చెప్పారు. ఈ ఈవెంట్‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ భార్య‌, హీరోయిన్ ర‌ష్మిక మంధాన ముఖ్య అతిథిగా హాజ‌రు కానుంది.

Kiran Abbavaram : శ్రీ కృష్ణుడిగా కిర‌ణ్ అబ్బ‌వ‌రం కొడుకును చూశారా? ఫోటోలు షేర్ చేసిన ర‌హ‌స్య గోర‌ఖ్

 

ఇటీవ‌ల ఓ చిత్ర షూటింగ్ లో ర‌ష్మిక గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆమె ఇంట్లో కోలుకుంటున్నారు. మ‌రిది కోసం ఇప్పుడు ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌కు వ‌స్తున్నారు.