Anand Deverakonda : నాకు వదిన అంటూ.. రష్మిక గురించి స్పెషల్ పోస్ట్ చేసిన ఆనంద్ దేవరకొండ..
తాజాగా ఆనంద్ దేవరకొండ రష్మిక, తన అన్నతో కలిసి దిగిన ఫోటో షేర్ చేస్తూ వదిన అంటూ రష్మిక గురించి స్పెషల్ పోస్ట్ చేసారు. (Anand Deverakonda)
- Saketh U
- Published On : February 27, 2026 / 08:30 AM IST
Anand Deverakonda
Anand Deverakonda : ఫిబ్రవరి 26న విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న ఘనంగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరి పెళ్లి ఫోటోలు వైరల్ గా మారాయి. ఫ్యాన్స్ వీరి పెళ్లిపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పలువురు సెలబ్రిటీలు వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
తాజాగా విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ రష్మిక, తన అన్నతో కలిసి దిగిన ఫోటో షేర్ చేస్తూ వదిన అంటూ రష్మిక గురించి స్పెషల్ పోస్ట్ చేసారు.
ఆనంద్ దేవరకొండ తన పోస్ట్ లో.. చాలాసార్లు ఫ్యాన్స్ వదిన ఎలా ఉన్నారు అని అడిగేవాళ్ళు అప్పుడు నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలిసేది కాదు. ఇవాళ మా అన్న పెళ్లి చేసుకున్నాడు. చాలా పాజిటివ్, దయ ఉన్న వ్యక్తి నాకు వదిన గా వచ్చింది. వాళ్ళు జీవితాంతం ఇలాగే నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నాను అని తెలిపాడు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
