Anand Deverakonda : చిన్నప్పుడు మహేష్ బాబులా ట్రై చేశా.. విజయ్ దేవరకొండ తమ్ముడు మహేష్ బాబుకి ఇంత పెద్ద అభిమానా? ?
మహేష్ బాబు సూపర్ హిట్ సినిమా పోకిరి రిలీజయి నేటికి 18 ఏళ్ళు అవుతుండటంతో ఆనంద్ దేవరకొండ ఓ స్పెషల్ పోస్ట్ చేశాడు.
- Saketh U
- Updated on- April 28, 2024 / 01:40 PM IST
Anand Deverakonda Special Post on Pokiri 18 Years and show his Fanism to Mahesh Babu
Anand Deverakonda : విజయ్ దేవరకొండ తమ్ముడిగా దొరసాని సినిమాతో సినీ పరిశ్రమకు పరిచయమైనా ఆనంద్ దేవరకొండ ప్రతిసారి కొత్త కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. గత సంవత్సరం బేబీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి 100 కోట్ల భారీ హిట్ కొట్టాడు. త్వరలోనే గంగం గణేశా సినిమాతో రాబోతున్నాడు. మహేష్ బాబు సూపర్ హిట్ సినిమా పోకిరి(Pokiri) రిలీజయి నేటికి 18 ఏళ్ళు అవుతుండటంతో ఆనంద్ దేవరకొండ ఓ స్పెషల్ పోస్ట్ చేశాడు.
ఆనంద్ దేవరకొండ పోకిరి సినిమాలో మహేష్ బాబు(Mahesh Babu) పరిగెత్తే ఫోటో పోస్ట్ ని షేర్ చేస్తూ.. స్కూల్ కారిడార్లలో చిన్నప్పుడు చాలా మంది పిల్లల్లాగే నేను కూడా ఈ రన్నింగ్ స్టైల్‌ని ప్రయత్నించడం నాకు ఇంకా గుర్తుంది. షార్ప్ చేతులు, పెద్ద పెద్ద అడుగులు వేసే కాళ్ళు, కళ్ళల్లో కోపం.. అదొక ఐకానిక్ స్టైల్. ఆయనలాగా ఎవరికీ రాదు. ఇది నిజంగా ఒక మాస్టర్ పీస్ సినిమా. దిల్‌సుఖ్‌నగర్‌లోని కోణార్క్ థియేటర్ లో ఈ సినిమా క్రేజ్‌ను గుర్తొస్తుంది అని పోస్ట్ చేశాడు.
Also Read : Renu Desai : కూతురితో డాన్స్ వీడియో షేర్ చేసిన రేణు దేశాయ్.. నా బెస్ట్ డాన్సింగ్ పార్ట్నర్ అంటూ పోస్ట్..
దీంతో ఆనంద్ దేవరకొండ పోస్ట్ వైరల్ గా మారింది. మహేష్ అభిమానులు ఆనంద్ దేవరకొండ మహేష్ బాబుకి ఇంత పెద్ద ఫ్యానా అని సంతోషిస్తూ అతని ట్వీట్ ని షేర్ చేస్తున్నారు. ఇక పోకిరి సినిమా 2006లో రిలీజయి భారీ హిట్ కొట్టి అప్పట్లోనే 70 కోట్లకు పైగా కలెక్ట్ చేసి అప్పటివరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులన్నీ చెరిపేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ సినిమాతో మహేష్ బాబు స్థాయి అమాంతం పెరిగింది.
