Renu Desai : కూతురితో డాన్స్ వీడియో షేర్ చేసిన రేణు దేశాయ్.. నా బెస్ట్ డాన్సింగ్ పార్ట్నర్ అంటూ పోస్ట్..
తాజాగా రేణు దేశాయ్ ఓ డాన్స్ వీడియో షేర్ చేసింది.

Renu Desai Shares a Dance Video with Daughter Aadya goes Viral
Renu Desai : రేణు దేశాయ్ ఏ పోస్ట్ పెట్టినా వైరల్ అవ్వాల్సిందే. అందులోను పిల్లలు అకిరా, ఆద్యల గురించి పోస్ట్ చేస్తే క్షణాల్లో వైరల్ అవుతుంది. పవన్ అభిమానులు కూడా రెగ్యులర్ గా ఆద్య, అకిరాల గురించి పోస్టులు చేయమని అడుగుతూ ఉంటారు. తాజాగా రేణు దేశాయ్ ఓ డాన్స్ వీడియో షేర్ చేసింది.
ఆద్యతో డాన్స్ చేస్తున్న వీడియోని రేణు దేశాయ్ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. నా ఫేవరేట్ డ్యాన్సింగ్ పార్ట్నర్. మన ఫేవరేట్ పర్సన్ తో డాన్స్ చేస్తే థెరపీలా పనిచేస్తుంది అని పోస్ట్ చేసింది. అయితే వీడియోలో మొదట ఆద్య ఫేస్ చూపించకుండా తను డాన్స్ చేస్తూ ఆ తర్వాత ఆద్య ఫేస్ రివీల్ చేసింది.
Also Read : Sharrath Marar : ఆ విషయంలో నాకు, త్రివిక్రమ్ కి పవన్ క్లాస్ పీకారు..
దీంతో పవన్ అభిమానులు రేణు దేశాయ్, ఆద్య డాన్స్ వీడియోని తెగ వైరల్ చేస్తున్నారు. ఆద్య బాగా డాన్స్ చేస్తుంది ని కామెంట్స్ చేస్తున్నారు. తల్లీకూతుళ్లు డాన్స్ చేస్తున్న వీడియో మీరు కూడా చూసేయండి.