Sharrath Marar : ఆ విషయంలో నాకు, త్రివిక్రమ్ కి పవన్ క్లాస్ పీకారు..

తాజాగా నిర్మాత శరత్ మరార్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పవన్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Sharrath Marar : ఆ విషయంలో నాకు, త్రివిక్రమ్ కి పవన్ క్లాస్ పీకారు..

Producer Sharrath Marar Sensational Comments on Pawan Kalyan

Updated On : April 28, 2024 / 10:11 AM IST

Sharrath Marar : ప్రస్తుతం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. పవన్ కి అత్యంత సన్నిహితులు, స్నేహితులు తక్కువమంది ఉంటారు. వారిలో త్రివిక్రమ్(Trivikram), నిర్మాత శరత్ మరార్ పవన్ తో చాలా క్లోజ్ గా ఉంటారని తెలిసిందే. వీరిద్దరూ పవన్ తో ఎక్కువగా ఉంటారు, పవన్ కి సూచనలు, సలహాలు ఇస్తూ సపోర్ట్ గా ఉంటారని టాలీవుడ్ లో అందరికి తెలుసు. ఎన్నో ఏళ్ళ నుంచి వీరి స్నేహం కొనసాగుతుంది.

Also Read : Gully Boy Bhaskar : కొత్త ఇంట్లోకి జబర్దస్త్ కమెడియన్.. నా డ్రీమ్ హౌస్ అంటూ పోస్ట్..

తాజాగా నిర్మాత శరత్ మరార్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పవన్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శరత్ మరార్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండడు. డబ్బుల్ని ఎలా దాచుకోవాలి అని మనీ ప్లానింగ్ లేదు. ఎవరైనా వచ్చి సహాయం అంటే చేస్తాడు. చాలా డబ్బుల్ని అలా దానధర్మాలకు ఇచ్చేసాడు. ఇది అడ్వాంటేజ్ గా తీసుకొని కొంతమంది పవన్ ని డబ్బుల విషయంలో హెల్ప్ అని వచ్చి మోసం చేస్తారు. నేను, త్రివిక్రమ్ చాలా సార్లు చెప్పాము డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండు, కనీసం పిల్లల కోసం కొంత దాచుకో అని కూడా చెప్పాము. మేము ఇలా మాట్లాడితే పవన్.. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు, ఈ విషయంలో నాకేమి చెప్పక్కర్లేదు అంటూ మాకు క్లాస్ పీకేవాడు అని తెలిపారు. దీంతో శరత్ మరార్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.