Epic Trailer : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ‘ఎపిక్’ ట్రైలర్ వచ్చేసింది.. రష్మిక చేతుల మీదుగా రిలీజ్..

Epic Trailer

  • Updated on- September 4, 2026 / 08:42 PM IST

Epic Trailer

Epic Trailer : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా తెరకెక్కుతున్న సినిమా ఎపిక్. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణంలో ఆదిత్య హాసన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజయిన గ్లింప్స్, టీజర్, సాంగ్స్ తో మంచి అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. హీరోయిన్ రష్మిక మందన్న ఈ ఈవెంట్ కి గెస్ట్ గా హాజరయి ట్రైలర్ ని విడుదల చేసారు. ఈ ట్రైలర్ చూస్తుంటే ఒక అబ్బాయి లండన్ కి చదువు కోసం వెళ్లి అక్కడ ఒక అమ్మాయితో పరిచయం అయి అది లివ్ ఇన్ రిలేషన్ వరకు వెళ్లిన తర్వాత ఏం జరిగింది అని కామెడీ ఎమోషనల్ గా చూపించబోతున్నారు అని తెలుస్తుంది. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 11న థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

Also See : Sri devi : కోర్ట్ హీరోయిన్ ‘శ్రీదేవి’ వరలక్ష్మి వ్రతం.. ఫొటోలు..

మీరు కూడా ఎపిక్ ట్రైలర్ చూసేయండి..