Baby Movie : బేబీ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఈ మాన్‌సూన్‌ని ప్రేమతో..
ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య నటిస్తున్న మూవీ బేబీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ మాన్‌సూన్‌లో ప్రేమతో..
- gum 95921
- Published On : June 29, 2023 / 03:53 PM IST
Anand Deverakonda Viraj Ashwin Vaishnavi Chaitanya Baby movie release date
Baby : ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) ప్రధాన పాత్రల్లో నటిస్తూ చేస్తున్న సినిమా ‘బేబీ’. ట్రైయాంగిల్ లవ్ స్టోరీ నేపథ్యంతో హార్ట్ టచింగ్ లవ్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కుతుంది. టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ మారుతీ, నిర్మాత SKN కలిసి మాస్ మూవీ మేకర్స్ పతాకం పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. దీంతో ఈ సినిమా పై ప్రేక్షకుల్లో ఓ మోస్తరు అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్ అండ్ సాంగ్స్ కూడా ఆకట్టుకున్నాయి.
Slum Dog Husband Trailer : కుక్కను పెళ్లి చేసుకున్న బ్రహ్మాజీ కొడుకు.. కోర్టులో విడాకుల పంచాయతీ
ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు ప్రతి ఒక్కరు గుండెకు హత్తుకునేలా ఉన్నాయి. విజయ్ బూల్గ్‌నిన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఇక ప్రేక్షకుల్లో సినిమా పై పాజిటివ్ బజ్ క్రియేట్ అవ్వడంతో మూవీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే మేకర్స్ మాత్రం ఇప్పటివరకు విడుదల తేదీ పై ఒక క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా చిత్ర యూనిట్ హైదరాబాద్ ప్రసాద్ సినిమాస్ లో ‘బేబీ’ రిలీజ్ డేట్ ని గ్రాండ్ గా అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని జులై 14న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇక ఈ మాన్‌సూన్‌ని ప్రేమ కథతో ఎంజాయ్ చేయండి.
Anand Deverakonda Viraj Ashwin Vaishnavi Chaitanya Baby movie release date
The Academy : RRR టీంకు మరో అరుదైన గౌరవం.. అకాడమీ కొత్త సభ్యుల జాబితాలో ఏకంగా RRR నుంచి 6గురు..
కాగా ఈ సినిమాకి సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. 2020 లో వచ్చిన కలర్ ఫోటో సినిమాకి సాయి కథని అందించాడు. ఇక ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాకుండా నేషనల్ అవార్డుని కూడా అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు సాయి రాజేష్ దర్శకుడిగా పరిచయం అవుతూ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. కలర్ ఫోటోతో అందరి మనసులు దోచుకున్న సాయి.. ఈ మూవీతో ఎటువంటి మ్యాజిక్ ని క్రియేట్ చేస్తాడో చూడాలి. ఇక షార్ట్ ఫిలిమ్స్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి చైతన్య ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అవుతుంది.
