Spirit: ఊచకోతకు సిద్ధం అవ్వండి.. ‘స్పిరిట్’ సినిమాపై అనంత్ శ్రీరామ్ సెన్సేషనల్ కామెంట్స్

ప్రభాస్ స్పిరిట్(Spirit) సినిమా మ్యూజిక్ పై అనంత శ్రీరామ్ చేసిన కామెంట్స్ అంచనాలను పెంచుతున్నాయి.

Anantha Sriram interesting comments Prabhas Spirit movie music

  • ప్రభాస్ స్పిరిట్ సినిమాలో క్లాస్ సాంగ్స్
  • యాక్షన్ మాత్రం ఊచకోత కన్ఫర్మ్
  • అంచనాలు పెంచుతున్న అనంత్ శ్రీరామ్ కామెంట్స్

Spirit: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కల్ట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో వస్తున్న ‘స్పిరిట్(Spirit)’ చిత్రంపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఆ అంచనాలను రెట్టింపు చేసేలా గీత రచయిత అనంత శ్రీ రామ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఇటీవల ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న ఆయన ప్రభాస్ స్పిరిట్ సినిమా గురించి చెప్పిన విశేషాలు ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. సాధారణంగా ప్రభాస్ వంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరోల సినిమాలంటే భారీ శబ్దాలు, మాస్ బీట్స్ ఉంటాయని అందరూ భావిస్తారు. కానీ, స్పిరిట్ ఈ సినిమా ఆల్బమ్ విషయంలో సందీప్ రెడ్డి వంగా చాలా వైవిధ్యమైన బాట పట్టారని అనంత శ్రీరామ్ వెల్లడించారు.

Krithi Shetty: LIK ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ‘కృతి శెట్టి’ సందడి.. వైరల్ అవుతున్న గ్రీన్ శారీ ఫోటోస్

ఇప్పటికే రెండు పాటల రచన పూర్తయిందని, ఈ పాటలు అత్యంత క్లాసిక్ టచ్‌తో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. సంగీత ప్రియులకు ఒక అద్భుతమైన సాహిత్య విలువలున్న ఆల్బమ్‌ను అందించడమే లక్ష్యంగా హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీత దర్శకత్వంలో పని సాగుతోందని చెప్పుకొచ్చాడు. అయితే, పాటలు క్లాస్‌గా ఉన్నప్పటికీ, సినిమాలో మాస్ ప్రేక్షకులకు కావలసిన అసలైన విందు మాత్రం పుష్కలంగా ఉంటుందని అనంత శ్రీరామ్ భరోసా ఇచ్చారు. సందీప్ రెడ్డి వంగా మార్క్ యాక్షన్, వైలెన్స్ ఈ చిత్రంలో గట్టిగానే ఉంటాయని, తెరపై జరిగే ‘ఊచకోత’ అభిమానులకు పూనకాలు తెప్పిస్తుందని ఆయన వివరించారు.

ముఖ్యంగా ప్రభాస్ ఇందులో ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్న నేపథ్యంలో, ఆయన మానరిజమ్స్, యాక్షన్ ఘట్టాలు థియేటర్లలో ప్రేక్షకులను ఉర్రూతలూగించడం ఖాయమని స్పష్టమవుతోంది. క్లాస్ మ్యూజిక్, ఊర మాస్ యాక్షన్ కలయికతో ఒక సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను ఈ చిత్రం అందించబోతోందని క్లారిటీ ఇచ్చాడు అనంత్ శ్రీరామ్. దీంతో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇక, భారీ బడ్జెట్‌తో టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ తృప్తి దిమ్రీ హీరోయిన్ గా నటిస్తోంది.