Anasuya Bharadwaj: రజినీకాంత్‌తో యాంకర్ అనసూయ.. క్రేజీ పిక్స్ వైరల్.. సినిమా ఛాన్స్ కొట్టేసిందా?
రజినీకాంత్ తో సినిమా చేస్తున్న అనసూయ భరద్వాజ్(Anasuya Bharadwaj).
- V Santhosh Kumar
- Updated on- May 29, 2026 / 06:38 AM IST
Actress Anasuya bharadwaj met superstar rajinikanth
- రజినీతో అనసూయ క్రేజీ ఫోటోలు
- నెట్టింట వైరల్ అవుతున్న పిక్స్
- సినిమా ఛాన్స్ పై చర్చలు
Anasuya Bharadwaj: టాలీవుడ్ బుల్లితెరపై యాంకర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి, తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్న నటి అనసూయ భరద్వాజ్. ‘జబర్దస్త్’ షో ద్వారా లభించిన పాపులారిటీతో ఆమె వెండితెరపై కూడా దూసుకుపోతోంది. టాలీవుడ్ అగ్ర హీరోల చిత్రాల్లో నటిస్తూనే, ‘పుష్ప’ వంటి పాన్ ఇండియా సినిమాల్లో దాక్షాయణిగా, ‘రంగస్థలం’లో రంగమ్మత్తగా వైవిధ్యమైన పాత్రలు పోషించి నటిగా తనదైన ముద్ర వేసుకుంది.
Niharika Konidela: క్యూట్ స్మైల్.. క్రేజీ లుక్స్.. నిహారిక కొణిదెల చూపులకు నెటిజన్స్ ఫిదా
ఇదిలా ఉండగా, ఇటీవల అనసూయ(Anasuya Bharadwaj) తన కుటుంబంతో కలిసి సమ్మర్ వెకేషన్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో ఆమెకు అనుకోని అద్భుతమైన అవకాశం లభించింది. సూపర్ స్టార్ రజినీకాంత్‌ను కలిసిన అనసూయ, ఆయనతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. రజినీకాంత్ నా ‘ఆల్ టైమ్ ఫేవరెట్’ అంటూ ఆమె పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
ఈ ఫోటోలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. రజినీకాంత్ తదుపరి చిత్రంలో అనసూయకు కీలక పాత్ర దక్కిందని, అందుకే ఈ ఫోటోలు షేర్ చేసి హింట్ ఇచ్చిందని కొందరు అంటుంటే.. సెలవుల్లో అనుకోకుండా కలిసి కేవలం అభిమానంతోనే ఫోటో దిగిందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా, సూపర్ స్టార్‌తో అనసూయ దిగిన ఈ ఫోటోలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
