Anasuya Remuneration: అనసూయ సినిమాకు ఒక్క రోజు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..
బుల్లితెర, వెండితెర మీద మాత్రమే కాకుండా సోషల్ మీడియాలోనూ ఫొటో షూట్‌లతో, చిట్‌చాట్‌లతో ఫ్యాన్స్‌కు కావాల్సినంత వినోదాన్ని..
- Subhan Ali Shaik
- Updated on- May 6, 2021 / 11:18 AM IST
Anasuya Remuneration
Anasuya Remuneration: వయసుదేముంది.. గ్లామర్ ఉంటే చాలు అలా నడిపించేయొచ్చు. సినీ ఫీల్డ్ లో ఇది బాగా వర్కౌట్ అవుతుంది. అనసూయ భరద్వాజ్‌కు. పెళ్లి అయిందని, పిల్లలు ఉన్నారని ఆఫర్లు ఏం తగ్గిపోలేదు. ఏదో ఒక ఎంటర్ టైన్మెంట్ తో రోజూ మీడియాలో కనిపించే అనసూయను పరిచయం ఉన్న మనిషిలా ఫీలయ్యే అభిమానులు ఆమె ఏం చేసినా తెగ మెచ్చేసుకుంటుంటారు.
ఆ ప్రోత్సాహంతో బుల్లితెర, వెండితెర మీద మాత్రమే కాకుండా సోషల్ మీడియాలోనూ ఫొటో షూట్‌లతో, చిట్‌చాట్‌లతో ఫ్యాన్స్‌కు కావాల్సినంత వినోదాన్ని పంచుతోంది. ఇటీవలే ప్రధాన పాత్రలో నటించిన ‘థాంక్ యూ బ్రదర్’ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే.
తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఆహాలో మే 7 నుంచి ఈ సినిమా ప్రసారం కానుంది. ఆహా ఈ లో బడ్జెట్ మూవీని రూ.1.8 కోట్లకే కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపించాయి. తాజాగా ‘థ్యాంక్ యూ బ్రదర్’ కోసం అనసూయ తీసుకున్న పారితోషికం డిటైల్స్ బయటికొచ్చాయి. 17 రోజుల షూటింగ్ షెడ్యూల్ లో ఒక్క రోజుకే రూ.1.5 లక్షలు తీసుకుందట. అంటే మొత్తంగా పాతిక లక్షలు ముట్టినట్లు సమాచారం.
అశ్విన్ విరాజ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాతో రమేశ్ రాపర్తి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. గర్భిణిగా అనసూయ నటిస్తోంది. జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి సంయుక్తంగా నిర్మాణంలో ఈ ప్రాజెక్ట్ రెడీ అవుతుంది.
