Anasuya: మధురవాణిగా మారుతున్న దాక్షాయణి..?
బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ అందాల ఆరబోతలో ఎలాంటి పాపులారిటీని సాధించిందో, నటన విషయంలోనూ అంతే పేరు సంపాదించుకుంది. అటు హాట్ ఐటెం సాంగ్స్‌లోనూ....
- Anil Aaleti
- Published on- July 2, 2022 / 03:07 PM IST
Anasuya To Play Madhuravani For Ott Web Series
Anasuya: బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ అందాల ఆరబోతలో ఎలాంటి పాపులారిటీని సాధించిందో, నటన విషయంలోనూ అంతే పేరు సంపాదించుకుంది. అటు హాట్ ఐటెం సాంగ్స్‌లోనూ అమ్మడు రెచ్చిపోయే సీన్స్ మనం చూస్తూనే ఉన్నాం. అంతేగాక విలన్‌గానూ అనసూయ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అలాంటి అనసూయ, ఇప్పుడు ఓ సరికొత్త పాత్రలో నటించేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పుష్ప చిత్రంలో దాక్షాయణి పాత్రలో ఆమె నటన ఏ రేంజ్‌లో ఆడియెన్స్‌ను ఆకట్టుకుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.
Anasuya: యాంకర్ అనసూయ కొత్త ఫోటోలు.. చూసి తీరాల్సిందే!
అయితే ఇప్పుడు ఈ బ్యూటీ, ఓ ఓటీటీ ప్లాట్‌ఫాంలో రాబోయే ఓ వెబ్‌సిరీస్‌లో లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌లో లీడ్ రోల్‌లో నటించేందుకు రెడీ అవుతోందట. గురజాడ అప్పారావు రాసిన ‘కన్యాశుల్కం’ నేపథ్యంలో సాగే ఈ వెబ్‌సిరీస్‌లో అనసూయ మధురవాణి పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. లేడీ ఓరియెంటెడ్ వెబ్‌సిరీస్ కావడం, ఇందులో ఆమె పాత్రలో చాలా వేరియేషన్స్ ఉండటంతో, ఈ వెబ్‌సిరీస్‌లో నటించేందుకు అనసూయ కూడా ఓకే చెప్పేసినట్లుగా చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
Anasuya : జబర్దస్త్‌కి వరుస ఝలక్‌లు.. అనసూయ కూడా గుడ్‌బై??
ఇక ఈ వెబ్‌సిరీస్‌కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలో రాబోతున్నట్లుగా తెలుస్తోంది. అటు సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుల్లో నటించేందుకు అనసూయ ఆసక్తిని చూపుతుండగా, బుల్లితెరపై పలు ఛానల్స్‌లో యాంకర్‌గా తన హవా కొనసాగిస్తూనే ఉంది ఈ బ్యూటీ. మరి ఈ దాక్షాయణి మధురవాణిగా మారి ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి.
