Anchor Pradeep : తన లెగ్ సర్జరీ గురించి చెప్తూ ఎమోషనల్ అయిన ప్రదీప్.. పెయిన్ ఫుల్ డేస్ అంటూ..

తాజాగా టీవీ షోలో ప్రదీప్ తన లెగ్ ఇంజ్యురి గురించి మాట్లాడుతూ.. (Anchor Pradeep)

  • Published on- August 5, 2026 / 12:13 PM IST

Anchor Pradeep

Anchor Pradeep : ఓ పదేళ్ల పాటు అనేక టీవీ షోలతో యాంకర్ ప్రదీప్ ప్రేక్షకులను మెప్పించి బుల్లితెర స్టార్ అయ్యాడు. కానీ కరోనా సమయం నుంచి టీవీ షోలు కొన్ని తగ్గించి సినిమాలు కూడా చేస్తున్నాడు. ఇప్పటికే రెండు సినిమాలు హీరోగా చేసాడు ప్రదీప్. ప్రస్తుతం ఓ రెండు టీవీ షోలు చేస్తున్నాడు ప్రదీప్ మాచిరాజు.

తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో యాంకర్ ప్రదీప్ తన లైఫ్ లో పెయిన్ ఫుల్ డేస్ గురించి మాట్లాడాడు. గతంలో తనకు జరిగిన సర్జరీ గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యాడు. ప్రదీప్ కి మొదటి సినిమా షూటింగ్ సమయంలో పై నుంచి కింద పడి కాలికి పెద్ద గాయం అయి సర్జరీ అయింది. అప్పుడు కొన్నాళ్లపాటు షోలకు కూడా దూరంగా ఉన్నాడు ప్రదీప్. ఒకసారి సర్జరీ ఫెయిల్ అయితే మళ్ళీ సర్జరీ చేసారు డాక్టర్లు. ఈ విషయాన్ని గతంలోనే తన సినిమా ప్రమోషన్స్ లో తెలిపాడు.

Also Read : Sundeep Kishan : ‘కరికాల’గా వస్తున్న సందీప్ కిషన్.. లుక్ అదిరిందిగా.. రెండు పార్టులు.. రిలీజ్ డేట్స్ కూడా అనౌన్స్..

తాజాగా టీవీ షోలో ప్రదీప్ తన లెగ్ ఇంజ్యురి గురించి మాట్లాడుతూ.. షూటింగ్ లో యాక్సిడెంట్ అయినప్పుడు నా కాలు బాగా దెబ్బ తింది. లెగ్ సర్జరీ జరిగింది. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తున్నప్పుడు డాక్టర్లు కూడా 50 – 50 ఛాన్స్ అన్నారు. నడుస్తానో లేదు నమ్మకం లేదు. అప్పటికే కూర్చొని చేసే పనులు ఏం ఉన్నాయి, యాంకరింగ్ కూర్చొని చేయొచ్చా అని ఆలోచించాను. ఫిజికల్ గా లేచి రాలేకపోయాను. వద్దామనుకున్నా రాలేని పరిస్థితిలో ఉన్నా. నా జీవితంలో చాలా పెయిన్ ఫుల్ రోజులు అవి అని ఎమోషనల్ అయ్యాడు.

అయితే కష్టమైనా దాదాపు ఆరు నెలలు కష్టపడి ఆపరేషన్ తర్వాత ఫిజియో, వర్కౌట్స్ చేసి ప్రదీప్ మళ్ళీ పూర్తి స్థాయిలో నడవడం మొదలుపెట్టాడు. కొన్ని రోజులు కుంటుంతూనే టీవీ షోలు చేసాడు. ఇపుడు ప్రదీప్ పూర్తిగా కోలుకున్నాడు.