Sundeep Kishan : ‘కరికాల’గా వస్తున్న సందీప్ కిషన్.. లుక్ అదిరిందిగా.. రెండు పార్టులు.. రిలీజ్ డేట్స్ కూడా అనౌన్స్..
నేడు సందీప్ కిషన్ హీరోగా కరికాల అనే సినిమాని ప్రకటిస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. (Sundeep Kishan)
Sundeep Kishan
Sundeep Kishan : నేడు సందీప్ కిషన్ కొత్త సినిమా ప్రకటించారు. ఇటీవల అందరూ పీరియాడిక్, పవర్ ఫుల్ యుద్దాలు, రాజుల కాలం కథలతో వస్తున్నారు. సందీప్ కిషన్ కూడా అదే బాటలోకి వచ్చాడు. నేడు సందీప్ కిషన్ హీరోగా కరికాల అనే సినిమాని ప్రకటిస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.
షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై మహీధర్ రెడ్డి, రాజశేఖర్ నిర్మాణంలో శంబాల ఫేమ్ యుగంధర్ ముని దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా ఈ సినిమాని ప్రకటించారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ లో సందీప్ కిషన్ కత్తి పట్టుకొని గుర్రంపై యుద్ధ వీరుడిగా వెళ్తుండగా పక్కనే సింహం కూడా ఉంది. ఇక ఈ సినిమాని రెండు పార్టులుగా ప్రకటిస్తూ రిలీజ్ డేట్స్ కూడా ప్రకటించారు.
Also Read : Anakapalli : షూటింగ్ మొత్తం అనకాపల్లిలోనే.. సెన్సార్ వాళ్ళు కట్స్ వద్దని.. ‘అనకాపల్లి’ నిర్మాతలు..
కరికాల చాప్టర్ 1 సినిమా 2027 జులై 2న, చాప్టర్ 2 అక్టోబర్ 28, 2027న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. దీంతో ఈ కరికాల సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.

