Anchor Rashmi Gautam: నేనేం మాట్లాడినా అదే తీసుకొస్తారు ఎందుకు.. మీరు తిట్టినా నేను ఊరుకోను!
Anchor Rashmi Gautam Trolls: తనపై జరుగుతున్న ట్రోలింగ్‌పై ఎమోషనల్ కామెంట్స్ చేసిన యాంకర్ రష్మి గౌతమ్(Anchor Rashmi).
- V Santhosh Kumar
- Updated on- May 2, 2026 / 06:16 PM IST
Anchor Rashmi Gautam emotional comments regarding trolling on her
- జంతు క్రూరత్వంపై రష్మీ కామెంట్స్.
- రాజకీయ పార్టీలకు అతీతంగా స్పందన.
- ట్రోలర్లకు గట్టి కౌంటర్ ఇచ్చిన నటి.
Rashmi Gautam: స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె జంతు ప్రేమికురాలు కూడా. ఈ విషయంలో ఆమె ఎప్పుడు నెట్టింట వైరల్ గా మారుతూనే ఉంది. అంటే, ఈ విషయంలో ఆమె ట్రోలింగ్ కూడా అవుతూనే ఉంటుంది. తాజాగా, ఆమె ఈ ట్రోలింగ్‌పై తీవ్రంగా స్పందించారు. తానూ ఏ మతానికో లేదా రాజకీయ పార్టీకో వ్యతిరేకం కాదని, కేవలం జంతువులపై జరిగే క్రూరత్వాన్ని మాత్రమే ప్రశ్నిస్తున్నానని ఆమె స్పష్టం చేశారు. వైకాపా నేత ప్రదీప్ చింత చేసిన విమర్శల నేపథ్యంలో, తాను ఎదుర్కొంటున్న వేధింపులు కొత్తేమీ కాదని, గతంలోనూ అనేక సందర్భాల్లో ఇలాంటి అవమానాలను భరించానని రష్మీ(Anchor Rashmi) ఆవేదన వ్యక్తం చేశారు.
పండుగల సమయంలో జరిగే జంతుబలుల నుంచి గజమాల వేసేటప్పుడు ఏనుగులకు జరిగే హింస వరకు, తాను ప్రతి అంశంపై గళం విప్పానని ఆమె గుర్తు చేశారు. అప్పట్లో తనను దేశద్రోహి అని పిలిచినా వెనక్కి తగ్గలేదని పేర్కొన్నారు. ప్రజలు ఒక సమస్యను పరిష్కరించడం మానేసి, దానిని మరో అంశంతో పోలుస్తూ కాలక్షేపం చేస్తున్నారని ఆమె విమర్శించారు. జంతువుల పట్ల జరుగుతున్న అమానవీయ చర్యలను అడ్డుకోవడంలో ఎవరూ ముందుకు రావడం లేదని ఆమె అసహనం వ్యక్తం చేశారు.
రాజకీయాల పట్ల తన వైఖరిని స్పష్టం చేస్తూ, తాను ఏ పార్టీకి వ్యతిరేకం కాదని రష్మీ వెల్లడించారు. జంతు సంక్షేమం కోసం ఏ పార్టీ అయితే చిత్తశుద్ధితో కృషి చేస్తుందో, ఆ పార్టీకి తాను బహిరంగంగా మద్దతు ఇస్తానని ఆమె ప్రకటించారు. భవిష్యత్తులో కూడా జంతువుల హక్కుల కోసం తన పోరాటం కొనసాగుతుందని, ఇలాంటి ట్రోలింగ్స్‌కు తాను భయపడబోనని రష్మీ ఈ సందర్భంగా గట్టి కౌంటర్ ఇచ్చారు.
