సీనియర్‌కి జూనియర్ ఛాలెంజ్..

రోజా విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ‘రోజా వనం’లో పాల్గొని మొక్కలు నాటిన యాంకర్ రష్మి గౌతమ్..

  • Publish Date - March 7, 2020 / 09:00 AM IST

రోజా విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ‘రోజా వనం’లో పాల్గొని మొక్కలు నాటిన యాంకర్ రష్మి గౌతమ్..

బుల్లితెర హాట్ యాంకర్ రష్మి గౌతమ్ సీనియర్ యాంకర్ అనసూయకు ఛాలెంజ్ విసిరింది. ప్రముఖ నటి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ‘రోజా వనం’ పేరిట పర్యావరణాన్ని కాపాడడానికి మొక్కలునాటే కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణలో మొదలైన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ స్ఫూర్తిగా ఆమె ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

దీనిలో భాగంగా ప్రముఖులకు గ్రీన్‌ ఇండియ ఛాలెంజ్‌ విసిరి వారితో మొక్కలు నాటిస్తున్నారు. రోజా ఛాలెంజ్‌ను స్వీకరించి ఇప్పటికే ‘యాక్షన్ కింగ్’ అర్జున్, సీనియర్ నటి ఖుష్బూ తదితరులు మొక్కలు నాటారు. 

తాజాగా యాంకర్‌ రష్మి గౌతమ్ కూడా రోజా విసిరిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా నానక్‌రాంగూడలోని రామానాయుడు స్టూడియోలో మొక్కలు నాటి, తన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను యాంకర్ అనసూయ, హీరో సత్యదేవ్ (జ్యోతిలక్ష్మి ఫేమ్), కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ తదితరులకు చాలెంజ్ విసిరి, మొక్కలు నాటాలని కోరింది.

See Also | వధువు కమలాశ్రీపాద వరుడి ‘వెనుక’ కాదు ’పక్కనే’ నడిచింది