Anchor Sravanthi : ఆ రోజు సాయి ధరమ్ తేజ్ లేకపోతే.. 500 మంది మధ్యలో నేను ఒక్కదాన్నే.. స్రవంతి కామెంట్స్ వైరల్..
ఇన్నాళ్లు యాంకర్ గా మెప్పించిన స్రవంతి ఇప్పుడు నటిగా మారింది. (Anchor Sravanthi)
- Saketh U
- Published On : February 11, 2026 / 10:00 AM IST
Anchor Sravanthi
Anchor Sravanthi : ఇన్నాళ్లు యాంకర్ గా మెప్పించిన స్రవంతి ఇప్పుడు నటిగా మారింది. స్రవంతి సుహాస్ హే భగవాన్ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా యాంకర్ స్రవంతి కూడా ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఓ ఇంటర్వ్యూలో స్రవంతి ఎదుర్కున్న ఓ చేదు సంఘటనను తెలిపింది.(Anchor Sravanthi)
యాంకర్ స్రవంతి మాట్లాడుతూ.. విరూపాక్ష ప్రమోషన్స్ కి నేను సాయి ధరమ్ తేజ్, మూవీ టీమ్ ఆంధ్ర సైడ్ వెళ్ళాము. వందే భారత్ ట్రైన్ లో వెళ్ళాము. నేనొక్కదాన్నే అమ్మాయి. అక్కడికి వెళ్ళాక అందరూ అబ్బాయిలు చుట్టు ముట్టేశారు. ఒక ఐదారొందల మంది ఉంటారు. నేను అప్పుడు చుడిదార్ వేసుకొని నీట్ గానే ఉన్నాను. అయినా కొంతమంది అబ్బాయిలు మీద పడిపోయారు.
Also Read : Anchor Sravanthi : శివాజీ కామెంట్స్ పై యాంకర్ స్రవంతి.. ఆయన అలా మాట్లాడారని..
అంత మందిలో మంచిగా బట్టలు వేసుకున్నా అలా చేసారు. ఆ రోజు సాయి ధరమ్ తేజ్ గారు లేకపోతే ఏమయ్యేది అని భయపడ్డాను. ఆయన నన్ను చాలా ప్రొటెక్ట్ చేసారు. ట్రైన్ దిగి బయటకు కార్ దగ్గరికి వచ్చి నన్ను కార్ ఎక్కించేదాకా సాయి తేజ్ ప్రొటెక్ట్ చేసారు. అంతమంది అబ్బాయిల మధ్య సాయి తేజ్ లాంటి మంచి అబ్బాయిలు కూడా ఉంటారు అని తెలిపింది.
