Anchor Sravanthi : శివాజీ కామెంట్స్ పై యాంకర్ స్రవంతి.. ఆయన అలా మాట్లాడారని..
తాజాగా యాంకర్ స్రవంతి తను నటించిన హే భగవాన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శివాజీ కామెంట్స్ పై స్పందించింది. (Anchor Sravanthi)
- Saketh U
- Published On : February 11, 2026 / 08:25 AM IST
Anchor Sravanthi
Anchor Sravanthi : ఇటీవల ఓ సినిమా ఈవెంట్ లో శివాజీ హీరోయిన్స్ ని మంచి బట్టలు వేసుకోండి బయటకు వచ్చినపుడు అని కామెంట్స్ చేసాడు. అయితే ఈ మాట చెప్తూ రెండు అసభ్యకరమైన పదాలు వాడటంతో అది తప్పుగా వెళ్లి పెద్ద వివాదమే అయింది. అయితే శివాజీ వ్యాఖ్యలపై కొంతమంది విమర్శలు చేస్తున్నా సామాన్యులు, పలువురు సెలబ్రిటీలు మాత్రం సపోర్ట్ చేస్తున్నారు.(Anchor Sravanthi)
తాజాగా యాంకర్ స్రవంతి తను నటించిన హే భగవాన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శివాజీ కామెంట్స్ పై స్పందించింది.
Also Read : Sukumar : చరణ్ సినిమా కోసం.. సుకుమార్ ఆ హీరోయిన్ కి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడా?
యాంకర్ స్రవంతి మాట్లాడుతూ.. ఆయన మాట్లాడిన వాటిల్లో ఆ రెండు పదాలు తప్ప మిగతాది రాంగ్ అనిపించలేదు నాకైతే. మిగతా వాళ్లకు ఏం అనిపించిందో నాకు తెలీదు. నేను సినిమా థీమ్ ని బట్టి యాంకరింగ్ కి డ్రెస్ లు వేసుకెళ్తాను. కానీ నా పర్సనల్ ఛాయస్ మాత్రం చీరలే. నా దగ్గర వెయ్యి చీరలు ఉన్నాయి.
శివాజీ గారు అలా మాట్లాడిన తర్వాత నేను ఈవెంట్స్ కి శారీ కట్టుకొని వెళ్తే అలా అన్నారని కట్టుకుంటున్నావా, మంగపతి ఎఫెక్ట్ అని నన్ను అందరూ అడుగుతున్నారు. నా ఫ్రెండ్స్ కూడా అడిగారు. నా పోస్టుల కింద కామెంట్స్ చేస్తున్నారు. కానీ అంతకుముందు కూడా నేను చాలా ఈవెంట్స్ లో చీరలు కట్టుకున్నాను, ఇంట్లో పూజలకు కూడా చీరలు కట్టుకున్నాను కదా అది ఎవ్వరూ చూడరు అని తెలిపింది.
Also Read : Rajasaab : ఒరేయ్.. ఇదేందయ్యా.. హీరోయిన్ కి కూడా డూప్ వాడారా? రాజాసాబ్ పై మళ్ళీ ట్రోల్స్..
