Anchor Sravanthi : అమ్మను తలుచుకుంటూ.. యాంకర్ స్రవంతి మదర్స్ డే ఎమోషనల్ పోస్ట్..
నేడు మదర్స్ డే కావడంతో తన తల్లితో చిన్నప్పుడు దిగిన ఫోటోని షేర్ చేసి ఎమోషనల్ పోస్ట్ చేసింది స్రవంతి. (Anchor Sravanthi)
- Saketh U
- Updated on- May 10, 2026 / 09:25 AM IST
Anchor Sravanthi
Anchor Sravanthi : బిగ్ బాస్ తో మంచి ఫేమ్ తెచ్చుకున్న స్రవంతి చొకారపు ఇప్పుడు యాంకర్ గా దూసుకుపోతుంది. సినిమా ఈవెంట్స్, ఇంటర్వ్యూలతో బిజీగా ఉంది. ఇటీవలే నటిగా కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ వైరల్ అవుతుంది.
నేడు మదర్స్ డే కావడంతో తన తల్లితో చిన్నప్పుడు దిగిన ఫోటోని షేర్ చేసి ఎమోషనల్ పోస్ట్ చేసింది స్రవంతి.
Also Read : Mothers Day : మదర్స్ డే స్పెషల్.. తల్లి అంజనా దేవితో మెగా బ్రదర్స్ స్పెషల్ ఫోటోలు చూశారా..?
యాంకర్ స్రవంతి తన పోస్ట్ లో.. నా దగ్గర ఉన్న ఒకే ఒక్క ఫోటో ఇది ఒక్కటే. నిన్ను మిస్ అవ్వని రోజు అంటూ లేదు అమ్మ. నాకు తెలుసు నువ్వు పైన నుండి చూస్తూ నన్ను ప్రతిక్షణం కాపాడుతూనే ఉన్నావ్ అని. లవ్ యు,ఐ మిస్ యు సో మచ్ అమ్మ. గొప్ప అమ్మలందరికి హ్యాపీ మదర్స్ డే అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది.
