Anchor Sravanthi : డైమండ్ రింగ్ లాగేసారు.. చున్నీ చిరిగిపోయింది.. పాపం స్రవంతి..
ఓ ఇంటర్వ్యూలో పబ్లిక్ ఈవెంట్స్ లో ఎదురయ్యే సమస్యల గురించి మాట్లాడింది స్రవంతి. (Anchor Sravanthi)
- Saketh U
- Published On : February 19, 2026 / 12:48 PM IST
Anchor Sravanthi
Anchor Sravanthi : బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న యాంకర్ స్రవంతి ఇప్పుడు సినిమా ఈవెంట్స్ తో ఫుల్ బిజీగా ఉంది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ వైరల్ అవుతుంది. స్రవంతి యాంకర్ నుంచి నటిగా కూడా మారింది. స్రవంతి కీలక పాత్రలో నటించిన హే బల్‌వంత్ సినిమా ఫిబ్రవరి 20న రిలీజ్ కానుంది.(Anchor Sravanthi)
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పబ్లిక్ ఈవెంట్స్ లో ఎదురయ్యే సమస్యల గురించి మాట్లాడింది స్రవంతి.
Also Read : Raviteja : చిరంజీవి సినిమా కోసం రవితేజ సినిమా ఆపేసారా? ఇంకెప్పుడు వచ్చేది..
యాంకర్ స్రవంతి మాట్లాడుతూ.. కర్నూల్, అనంతపూర్ అటు వైపు మాస్ క్రౌడ్ ఉంటుంది కాలేజీ ఈవెంట్స్ లో. అక్కడ అందరూ అబ్బాయిలే వస్తారు. ఈవెంట్ కి హీరో వస్తాడు కానీ లేడీ ఆర్టిస్టులు ఉండరు. నేనొక్కదాన్నే అమ్మాయిని. అలంటి ఈవెంట్స్ నుంచి బయటపడితే చాలురా బాబు అనిపిస్తుంది.
ఓ సారి నా చెయ్యి పట్టుకొని డైమండ్ రింగ్ లాగేసారు. నా డైమండ్ రింగ్ పోయింది. ఒకసారి చున్నీ చిరిగిపోయింది. చాలా సార్లు అలాంటి పరిస్థితులు చూసాను. అక్కడ మనం ఏం చేయలేము. ఒకసారి నా అసిస్టెంట్ ఫోన్ కూడా పోయింది. విరూపాక్ష ప్రమోషన్స్ కి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ 500 మంది అబ్బాయిలు చుట్టూ ఉన్నారు. హీరో సాయి ధరమ్ తేజ్ జాగ్రత్తగా నన్ను బయటకు తీసుకెళ్లారు. ఆ రోజు ఆయన లేకపోతే నాకు కష్టమే అని తెలిపింది.
Also See : ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు – కనపడుటలేదు’ ట్రైలర్ రిలీజ్.. కొత్త వెబ్ సిరీస్ ఎందులో? ఎప్పట్నించి?
