Suma Kanakala : యాంకర్ సుమ తల్లి.. 82 ఏళ్ళ వయసులో ఎలా జిమ్ చేస్తున్నారో చూడండి..
సుమ గతంలో అనేకసార్లు వాళ్ళ అమ్మని ప్రేక్షకులకు పరిచయం చేసింది. వాళ్ళ అమ్మతో ఉన్న ఫోటోలు, చేసిన వీడియోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసింది సుమ.
- Saketh U
- Published On : October 13, 2023 / 06:59 AM IST
Anchor Suma Mother workouts in Gym Video goes Viral
Suma Kanakala : మలయాళీ అమ్మాయి అయినా తన మాటలతో, షోలలో తన కబుర్లతో, ఈవెంట్స్ లో తన వాగ్దాటితో దాదాపు గత 20 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులని మెప్పిస్తూ తెలుగు వారిళ్ళల్లో ఒక ఆడపడుచు అయ్యింది యాంకర్ సుమ కనకాల. ఇప్పుడు కూడా టీవీ షోలు, సినిమా ఈవెంట్స్, అప్పుడప్పుడు సినిమాలు, యూట్యూబ్.. వీటితో పాటు ఫ్యామిలీ అంటూ ఫుల్ బిజీగా ఉంది సుమ.
సుమ గతంలో అనేకసార్లు వాళ్ళ అమ్మని ప్రేక్షకులకు పరిచయం చేసింది. వాళ్ళ అమ్మతో ఉన్న ఫోటోలు, చేసిన వీడియోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసింది సుమ. సుమ వాళ్ళ అమ్మకి ఇప్పుడు 82 ఏళ్ళు. ప్రస్తుతం సుమతో పాటు వాళ్లింట్లోనే ఉంటున్నారు. తాజాగా సుమ వాళ్ళ అమ్మకి సంబంధించిన ఓ వీడియో షేర్ చేయగా అది వైరల్ గా మారింది.
సుమ వాళ్ళ అమ్మ జిమ్ లో థ్రెడ్ మిల్ పై నడుస్తుంది. 82 ఏళ్ళ వయసులో ఆమె థ్రెడ్ మిల్ పై ఫాస్ట్ గా నడవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. దీంతో ఈ వయసులో ఆమె ఇంకా అంత ఆరోగ్యంగా ఉన్నారంటే గ్రేట్ అని, అసలు ఆమె 82 ఏజ్ లాగే కనిపించట్లేదని అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక సుమ ఈ వీడియో షేర్ చేసి.. ఇవాళ నేను ఇక్కడ ఉన్నాను అంటే అందుకు మా అమ్మే కారణం అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది.
