Bigg Boss 7 Day 39 : పోనిలే పాపం అని మళ్ళీ ప్రశాంత్‌కి కెప్టెన్సీ ఇచ్చిన బిగ్‌బాస్.. ఆటగాళ్లు వర్సెస్ పోటుగాళ్ళు..

బిగ్‌బాస్ లో కొత్త కంటెస్టెంట్స్ వచ్చాక పాత వాళ్ళని ఆటగాళ్లు, కొత్తవాళ్ళని పోటుగాళ్ళు అనే టీంలుగా విడగొట్టిన సంగతి తెలిసిందే.

Bigg Boss 7 Day 39 : పోనిలే పాపం అని మళ్ళీ ప్రశాంత్‌కి కెప్టెన్సీ ఇచ్చిన బిగ్‌బాస్.. ఆటగాళ్లు వర్సెస్ పోటుగాళ్ళు..

Bigg Boss 7 Day 39 Highlights Captaincy return to Pallavi Prashanth

Updated On : October 13, 2023 / 6:45 AM IST

Bigg Boss 7 Day 39 : బిగ్‌బాస్ లో కొత్త కంటెస్టెంట్స్ వచ్చాక పాత వాళ్ళని ఆటగాళ్లు, కొత్తవాళ్ళని పోటుగాళ్ళు అనే టీంలుగా విడగొట్టిన సంగతి తెలిసిందే. వారి మధ్య కెప్టెన్సీ టాస్కుల కోసం గేమ్స్ పెడుతున్నారు. మొన్న బుధవారం ఎపిసోడ్ లో మూడు గేమ్స్ లో పోటుగాళ్ళు గెలిచారు. ఒక గేమ్ లో ఆటగాళ్లు గెలిచారు. ఇక నిన్న గురువారం ఎపిసోడ్స్ లో కూడా కంటెస్టెంట్స్ మధ్య గేమ్స్ నిర్వహించాడు బిగ్‌బాస్.

హూ ఈజ్ ఫోకస్డ్, హూ ఈజ్ స్మార్ట్ అనే రెండు గేమ్స్ నిర్వహించగా రెండిట్లోనూ ఆటగాళ్లు గెలిచారు. ఇక మధ్య మధ్యలో నిన్నటి ఎపిసోడ్ లో బిగ్‌బాస్ కాసేపు నవ్వించాడు. కంటెస్టెంట్స్ కి విచిత్రమైన పనులు చెప్తూ, పనిష్మెంట్స్ ఇస్తూ కంటెస్టెంట్స్ తో పాటు ప్రేక్షకులని నవ్వించాడు బిగ్‌బాస్.

Also Read : Bigg Boss 7 Day 38 : వచ్చిన కెప్టెన్సీని వాడుకోలేకపోయాడు.. శివాజీ కూడా ప్రశాంత్ పై ఫైర్ అయ్యాడు..

బుధవారం ఎపిసోడ్ లో ప్రశాంత్ అసలేమీ చేయట్లేదని కెప్టెన్సీ లాక్కున్న సంగతి తెలిసిందే. మళ్ళీ నిన్నటి ఎపిసోడ్ లో ఏమైందో కానీ నీకు గుణపాఠం నేర్పేందుకు కెప్టెన్సీ తీసుకున్నాను అని చెప్పి బిగ్‌బాస్ ప్రశాంత్ కి కెప్టెన్సీని తిరిగి ఇచ్చేశాడు. దీంతో ప్రశాంత్ ఈసారి పాత్రం కెప్టెన్ ఎలా ఉండాలో చూపిస్తాను అని చెప్పి థ్యాంక్స్ చెప్పాడు.